Drumstick : మునగ పంటను ఆశించే ఆకుతినే పురుగుల నుండి పంటను సంరక్షించే పద్ధతులు..!

మునగ చెట్లను ఒకప్పుడు పెరటి తోటల్లో పెంచేవారు.అయితే వాణిజ్యపరంగా సాగు చేస్తున్న కూరగాయ పంటలలో ప్రస్తుతం మునగ పంట కూడా ఒకటి.

మన దక్షిణ భారతదేశంలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న కూరగాయ పంటలలో ఈ మునగ పంట కూడా ఉంది.

"""/" / మునగ పంట( Drumstick Crop ) సాగుకు దాదాపుగా అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.

నేల యొక్క పీహెచ్ విలువ 6-7.5 ( PH Value Is 6-7.

5 )మధ్య ఉండే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.మునగ పంట సాగులో సేంద్రీయ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

మునగ చెట్ల మధ్య, చెట్ల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉంటే మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగులుతుంది.

దీంతో మొక్కలు ఆరోగ్యకరంగా పెరగడంతో పాటు వివిధ రకాల చీడపీడలు( Pests ) లేదంటే తెగుళ్ల వ్యాప్తి చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది.

మునగ పంట అధిక చలిని తట్టుకోలేదు.ఇక పొలంలో కలుపు మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.

పంటకు ఏవైనా తెగులు ఆశిస్తే, ఆ మొక్కలను తొలగించడం వల్ల తెగుళ్ల వ్యాప్తి ఉండదు.

"""/" / మునగ పంటకు ఆశించి తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికొస్తే.

ఆకు తినే పురుగులు( Leaf-eating Insects ) కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ పురుగుల ఉధృతి డిసెంబర్-జనవరి, మార్చి-ఏప్రిల్ నెలలో అధికంగా ఉంటుంది.ఈ పురుగుల లార్వాలు పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

ఇవి మొక్కల ఆకులను ఆహారంగా తీసుకుంటాయి.ఈ పురుగులను గుర్తించిన తర్వాత రెండు మిల్లీలీటర్ల క్వినాల్ ఫాస్ ను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేసి ఈ పురుగులను పూర్తిగా అరికట్టాలి.

అధిక దిగుబడి సాధించాలంటే పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ తొలి దశలోనే చీడపీడలు లేదంటే తెగులను పూర్తిస్థాయిలో అరికట్టాలి.

కాబట్టి సాగు విధానంలో ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలో ఉండే వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాలు తెలుసుకొని పాటించాలి.