ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ( Posani Krishna Murali ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాజకీయ నేత వంగవీటి రంగాను టీడీపీ అధినేత చంద్రబాబే హత్య చేయించారని ఆరోపించారు.
ఎమ్మెల్యేగా వంగవీటి రంగా కృష్ణాతో పాటు గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు ప్రకాశం జిల్లాల్లో అధిక ప్రాబల్యాన్ని కలిగి ఉండేవారు.ఆ ఐదు జిల్లాల్లో ఎన్టీఆర్ కంటే రంగా గొప్ప నాయకుడని పేర్కొన్నారు.

వంగవీటి రంగా( Vangaveeti Mohana Ranga )ను ఎంత హింసించారో అందరికీ తెలుసన్న పోసాని అడ్డు తప్పించుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఆయనను హత్య చేయించారని ఆరోపణలు చేశారు.చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణను గతంలో పవన్ తిట్టారు.కానీ ఇప్పుడు అదే చంద్రబాబు కోసం పవన్ పని చేస్తున్నారని విమర్శించారు.ఈ క్రమంలోనే అసలు చంద్రబాబుకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు.







