ఉద్యానవన తోటలలో ఒకటైన ద్రాక్ష తోటల( Grapes Crop ) సాగులో సరైన యాజమాన్య పద్ధతులను కొన్ని మెళుకువలు పాటించి సాగు చేస్తే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందవచ్చు.ద్రాక్ష పంటకు చీడపీడల బెడదతో పాటు తెగుళ్ల బెడద( Pests ) కూడా కాస్త ఎక్కువే.
సకాలంలో వీటిని గుర్తించి తొలిదశలోనే అరికట్టాలి.అంటే ద్రాక్ష తోటలను తరచూ గమనిస్తూ ఉంటూ, తోటలను సంరక్షించుకోవాలి.
ద్రాక్ష తోటలకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే తామర పురుగులు కీలక పాత్ర పోషిస్తాయి.ఈ తామర పురుగులు ఒకటి నుంచి రెండు మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి.
ఈ పురుగులు నలుపు, పసుపు రంగులో ఉంటాయి.ఈ పురుగులు మొక్కల అవశేషాలలో, మట్టిలో, ఆతిధ్య కలుపు మొక్కలపై నిద్రావస్థలో ఉంటాయి.
ఇవి అనేక చీడపీడలకు వాహకాలుగా ఉంటాయి.పొడి వాతావరణం, వేడి వాతావరణం ఈ పురుగుల ఎదుగుదలకు చాలా అనుకూలం.
కానీ గాలితో కూడిన తేమ ఉంటే ఇవి ఎదగలేవు.

ఈ పురుగులు ఆకుల కింది భాగంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి.ఆకు అడుగు బాగాన నల్లటి పేడరంగు మచ్చలను గుర్తించవచ్చు.ఈ పురుగులు ఆశించిన మొక్కల ఆకులు( Leaves ) క్రమంగా పసుపు రంగులోకి మారి, పూర్తిగా రంగు మారిపోయి ముడుచుకుపోతాయి.
ద్రాక్ష తోట మొగ్గలు లేదా పూత వృద్ధి చెందుతున్న దశలో ఉన్నప్పుడు ఈ పురుగులు ఆశించడం వల్ల ద్రాక్షకాయలపై గీతలు పడిన లేదా కుంగిపోయిన లేదంటే రూపుమారిన పువ్వులు లేదా పండ్లు ఏర్పడి దిగుబడి తగ్గే అవకాశం ఉంది.

ఈ తామర పురుగులు ద్రాక్ష మొక్కలను( Grape Plants ) ఆశించకుండా ఉండాలంటే వరుసల వెంబడి ప్లాస్టిక్ లేదా సేంద్రీయ రక్షణ కవచాన్ని అమర్చాలి.ద్రాక్ష మొక్కల చుట్టూ కలుపు మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.ఎక్కువ పరిధిలో జిగురు వుచ్చులను ఉపయోగించాలి.
మొక్కల చివరి భాగాలను కత్తిరించకుండా కొమ్మలు మొదలయ్యే ప్రాంతానికి మరియు కణుపులకు కొద్దిగా పైన కత్తిరించాలి.వివిధ రకాల వ్యాధులు సోకిన మొక్కలను మరియు మొక్కల అవశేషాలను తొలగించి నాశనం చేయాలి.
అధికంగా నత్రజని ఎరువులను ఉపయోగించకూడదు.ఈ పురుగులను గుర్తించిన తర్వాత రసాయన పిచ్చికారి మందులైన ఫిప్రోనిల్, ఇమిడాక్లోప్రిడ్, ఎసిటామిప్రమిడ్ పెరిత్రాయిడ్స్ లలో ఏదో ఒక దానిని పిపెరోనిల్ బుటాక్సైడ్ ను కలిపి పిచికారి చేయాలి.








