అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన సూపర్ ట్యూస్ డే ఈవెంట్ గత మంగళవారం ముగిసిన సంగతి తెలిసిందే.డెమొక్రాట్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధిత్వం కోసం శ్రమిస్తున్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌లు( Donald Trump , Joe Biden ) అప్రతిహత విజయాలతో దూసుకెళ్లి ఫైనల్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకున్నారు.ఇదిలావుండగా సూపర్ ట్యూస్‌డే ప్రైమరీలలో ఇండియన్ అమెరికన్ అభ్యర్ధులకు మిశ్రమ ఫలితాలు లభించాయి.15 రాష్ట్రాలు, అమెరికన్ సమోవాలు బ్యాలెట్‌ను నిర్వహించాయి.అయితే భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యులు అమీ బెరా, రో ఖన్నాలు( Amy Bera, Ro Khanna ) తమ స్థానాలను కాపాడుకున్నారు.

డెమొక్రాట్ నేత, అమీబెరా కాలిఫోర్నియాలోని 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో 53.6 శాతం ఓట్లతో సార్వత్రిక ఎన్నికలకు ముందుకు రావడం ద్వారా 7వసారి పదవీకాలాన్ని పొందారు.రో ఖన్నా.17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ అనితా చెన్‌పై ( Republican Anita Chen )విజయం సాధించి ఐదవసారి పదవీకాలాన్ని పొందినట్లు అమెరికన్ బజార్ నివేదించింది.దీనికి భిన్నంగా డెమొక్రాట్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ రిషి కుమార్ కాంగ్రెస్‌కు పోటీ చేసేందుకు ప్రయత్నించి ఓడిపోయారు.
శాన్ జోస్ మాజీ మేయర్ సామ్ లిక్కార్డో 22 శాతం ఓట్లతో ముందంజలో వుండగా.శాంటా క్లారా కౌంటీ సూపర్‌వైజర్ జో సిమిటియన్ 18 శాతం ఓట్లు పొందారు.11 మంది అభ్యర్ధుల్లో రిషి కుమార్ 6.3 శాతం ఓట్లతో ఏడో స్థానంలో నిలిచారు.

భారతీయ అమెరికన్ రిపబ్లికన్ విన్ క్రుట్టివెంటి ( Win Cruttiventi )నార్త్ కాలిఫోర్నియాలోని 14వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో సార్వత్రిక ఎన్నికలకు చేరుకున్నారు.దేశంలోని అతిపెద్ద భారతీయ అమెరికన్ల జనాభా ఈ ప్రాంతంలోనే వుంది.ఫెడరల్ ఎన్నికల కమీషన్ నివేదికల ప్రకారం.ఏ5 సర్వీసెస్ వ్యవస్ధాపకుడు, సీఈవో అయిన క్రుత్తివెంటి తన ప్రచారంలో దాదాపు 5,00,000 డాలర్ల నిధులను పెట్టుబడి పెట్టారు.దివంగత సెనేటర్ డయాన్ ఫెయిన్ స్టెయిన్ ఖాళీ చేసిన యూఎస్ సెనేట్ సీటు కోసం ప్రయత్నించిన క్లినికల్ సైకాలజిస్ట్ హర్మేష్ కుమార్ ప్రతికూల ఫలితం పొందారు.డెమొక్రాట్ పార్టీకే చెందిన యాష్ కల్రా 25వ అసెంబ్లీ జిల్లాలో అభ్యర్ధిగా నిలిచారు.సాధారణ ఎన్నికల్లో సహచర డెమొక్రాట్ లాన్ న్గోతో ఆయన తలపడతారు.30 ఏళ్ల తారా శ్రీకృష్ణన్ పలు ఎండార్స్‌మెంట్లను పొంది.కాలిఫోర్నియాలోని 26వ జిల్లా రాష్ట్ర అసెంబ్లీ స్థానానికి జరిగిన పోటీలో ఓటమి పాలయ్యారు.







