బెల్లి ఫ్యాట్ తగ్గాలన్నా... బాలింతల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండాలన్న ఇవి తింటే చాలు..!

ఈ కాలంలో అధిక బరువుతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు.బరువు పెరిగాక బాధపడేకంటే పెరగక ముందే జాగ్రత్త పడడం మంచిది కదా.

బరువు పెరిగాక దానిని తగ్గించుకోవడం కోసం చాలా మంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు గంటల తరబడి జిమ్స్‌లో రకరకాల ఫీట్స్ చేస్తున్నారు.మరికొందరు అయితే విపరీతమైన డైటింగ్ చేసేసి త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేసిన కొంతమంది బరువు తగ్గుతున్నారు కానీ.మరికొందరిలో అయితే ఎలాంటి మార్పు ఉండడం లేదు.

అయితే మేము చెప్పే ఈ వంటింటి చిట్కాలు పాటించడం వలన మీ శరీరం యొక్క బరువు సునాయసంగా తగ్గుతుంది.అలాగే ఈ టిప్స్ పాటించడానికి మీరు పెద్దగా కష్ట పడాలిసిన పని కూడా లేదు.

Advertisement

మరి ఆ టిప్స్ ఏంటో చూద్దామా.వెయిట్ తగ్గడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి.

మెంతులు తినడం ద్వారా బరువు సులభంగా తగ్గుతారు.ఎందుకంటే మెంతి గింజల్లో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉన్నాయి.

అవి సూపర్ ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే మెంతుల్లో ఫైబర్ శాతం కూడా అధికంగా ఉంటుంది.

ఇది జీర్ణ శక్తిని మరింత మెరుగుపరుస్తుంది.మెంతులు తినడం వల్ల డయాబెటిస్ రోగుల షుగర్ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

ముందుగా బరువు తగ్గాలని భావించేవారు రాత్రి వేళ నిద్రపోయే ముందు ఒక గ్లాసులో నీటిలో కొన్ని మెంతి గింజలు వేసి నాన బెట్టుకోవాలి.

Advertisement

ఉదయాన్నే లేచిన తరువాత డైరెక్ట్ గా మెంతులను వడగట్టి ఆ నీటిని తాగినా సరే., లేకపోతే ఆ మెంతులను నీటిలో మరిగించి అయినా తాగాలి.ఇలా చేస్తే శరీరంలోని కొవ్వు మొత్తం కరుగడంతో పాటు మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.

అలాగే నడుము చుట్టూ పేరుకు పోయిన కొవ్వు తగ్గాలంటే మెంతి టీ ఉత్తమం అనే చెప్పాలి.అది ఎలా తయారుచేయాలంటే ఒక చెంచా మెంతులు, దాల్చిన చెక్క, కొద్దిగా అల్లాన్ని నీటిలో వేసి మరిగించి, వడకట్టి తాగడం వలన బెల్లి ఫ్యాట్ బర్న్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా బరువు తగ్గడానికి మెంతులను నీటిలో మరిగించి ఆ నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగినాసరే బరువు తగ్గుతారు.అలాగే మెంతికూర పప్పు తినడం వలన బాలింతల్లో పాల ఉత్పత్తి అధికమవుతుంది.

" autoplay>

తాజా వార్తలు