కాఫీ తాగుతుండగా ఫ్రెంచ్‌ మహిళను ఢీకొట్టిన ఉల్క.. తర్వాత ఏం జరిగిందో ఊహించలేరు!

ఫ్రాన్స్‌( France )లో ఓ అనూహ్య సంఘటన జరిగింది.

ఓ మహిళ తన స్నేహితురాలితో కలిసి టెర్రస్‌పై కూర్చుని కబుర్లు చెబుతూ కాఫీ తాగుతుండగా ఆమెకు ఒక వింత వస్తువు తగిలింది.

సరిగ్గా చెప్పాలంటే పక్కటెముకలకి గులకరాయి తగిలినట్లుగా అనిపించిందని ఆమె తెలిపింది.ఇది పైకప్పుపై జారుతూ వచ్చి తనకు తగిలిన ఓ సిమెంట్ ముక్క కావచ్చని ఆమె తొలుత భావించింది.

అది ఏమిటో తెలుసుకోవడానికి, ఆమె దానిని పరిశీలించమని రూఫింగ్ ప్రొఫెషనల్‌ని కోరింది.అయితే అది ఒక ఉల్క అని సదరు ప్రొఫెషనల్ నిర్ధారించారు.

దాంతో ఆ మహిళ ఒక్కసారిగా అవాక్కయ్యింది.ఈ రాయి నిజంగా అంతరిక్షం నుంచి వచ్చిందా? ఇది చాలా విడ్డూరంగా ఉందే అంటూ ఆమె తన సంభ్రమాశ్చార్యాన్ని వ్యక్తం చేసింది.

Advertisement

అప్పటికీ ఆమెకు అది ఒక ఉల్క( Meteorite ) అని నమ్మకం కలగలేదు.దాంతో ఆ రాయి చేత పట్టుకుని ఒక జియాలజిస్ట్‌( Geologist )ను సంప్రదించింది.అది నిజంగా ఇనుము, సిలికాన్‌తో తయారైన ఉల్క అని ఆ శాస్త్రవేత్త కూడా నిర్ధారించారు.

ఉల్కను కనుగొనడమే చాలా అరుదు, అలాంటిది ఒక ఉల్క మానవుడికి వచ్చి తగలడం మరింత అరదు అని సదరు జియాలజిస్ట్ చెప్పారు.ఫ్రాన్స్‌లో ఇలాంటి ఉల్కలను కనుగొనడం చాలా రేర్.

ఎందుకంటే అవి సాధారణంగా భూమి వరకు వచ్చే ముందే పర్యావరణంలో కలిసిపోతాయి.కానీ ఎడారి ప్రాంతాల్లో, వాటిని కనుగొనడం సులభం.

కాబట్టి, ఇది చాలా అసాధారణమైన సంఘటన.అదృష్టవశాత్తూ ఆ మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు.తన ఫ్రెండ్‌తో కాఫీ టైమ్( Coffee Time ) ఎంజాయ్ చేస్తుండగా ఈ ఉల్క సరదాగా ఆమెను పలకరించింది అంతే!

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఈ ఆశ్చర్యకరమైన సంఘటన గురించి తెలిసి చాలామంది వావ్, వాట్ ఏ ఇన్సిడెంట్! అని కామెంట్లు చేస్తున్నారు.హాయిగా కాఫీ తాగుతున్న సమయంలో ఇలాంటి ఉల్క తగులుతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.ఇదేదో సైఫై మూవీలో సీన్ లాగానే ఉందే అని ఇంకొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అయితే కొందరు నిపుణులు అది ఉల్క కాకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా ఈ సంఘటన వైరల్( Viral ) గా మారింది.

తాజా వార్తలు