దాదాపుగా 30 ఏళ్ల తర్వాత చిరంజీవికి ఇలాంటి పరిస్థితా.. అప్పట్లో ఫ్లాపులొస్తే చిరు ఏం చేశారంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )తాజాగా నటించిన భోళా శంకర్ సినిమా ( Bhola shankar )విడుదల అయ్యి ఘోరమైన డిజాస్టర్ చవి చూసిన విషయం తెలిసిందే.

దీంతో మెగాస్టార్ చిరంజీవి పై మూవీ మేకర్స్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

దానికి తోడు జీరో కలెక్షన్లు రావడంతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ని ఆపలేక ఒక రకంగా అభిమానులు నరకం చూస్తున్నారని చెప్పవచ్చు.ఇంకా చెప్పాలంటే భోళా శంకర్ సినిమా మెగా అభిమానులకు కూడా ఏమాత్రం నచ్చలేదు.

గతంలో ఆచార్య సినిమా తరువాత ఎలా అయితే ట్రోలింగ్స్ ని ఎదుర్కొన్నారో ఇప్పుడు మళ్లీ మళ్లీ అదే ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటున్నారు మెగాస్టార్.

కాగా చిరంజీవి అప్పట్లో అనగా 1995లో ఇంచుమించు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు.ముఠామేస్త్రి( Mutamestri ) మూవీ తర్వాత వరస వైఫల్యాలు ఆయన మార్కెట్ ని బాగా దెబ్బ కొట్టాయి.మల్టీ స్టారర్ మెకానిక్ అల్లుడు ఘోరంగా దెబ్బ తినగా ట్రిపుల్ యాక్షన్ చేసిన ముగ్గురు మొనగాళ్లు అతి కష్టం మీద యావరేజ్ దగ్గర ఆగిపోయింది.

Advertisement

ఎస్పి పరశురామ్, బిగ్ బాస్ నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.అల్లుడా మజాకాకు డబ్బులు వచ్చినా వివాదాలు, విమర్శల ముందు అవి చిన్నవే.ఇక రిక్షావోడు ఇంకా అన్యాయం.

ఇప్పటి భోళా రేంజ్ లో జనాలు థియేటర్లకు రాకుండా చేసింది.తాను ఎక్కడ లెక్క తప్పుతున్నానో విశ్లేషించుకోవడానికి చిరు ఆరు నెలలకు పైగా మేకప్ కి దూరంగా ఉండి క్షుణ్ణంగా ఆలోచించి బడ్జెట్ రిస్క్ లేకుండా వచ్చిన హిట్లర్ ని ఒప్పుకున్నారు.

కట్ చేస్తే హిట్లర్ భారీ విజయం సాధించింది.అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు.తిరిగి 2001లో మృగరాజు, శ్రీ మంజునాథ, ( Sri Manjunatha )డాడీ అంచనాలు అందుకోవడంలో ఫెయిలైతే ఇంద్ర తర్వాత ఫ్యాన్స్ సంతృప్తి చెందారు.

మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత 28 సంవత్సరాల నాటి సందిగ్దతను చిరు మళ్ళీ ఎదురుకుంటున్నారు.దీన్ని తీర్చే దర్శకుడు కళ్యాణ్ కృష్ణనో లేక వశిష్టలో ముందు ఎవరవుతారో చూడాలి మరి.మరొకవైపు అభిమానులు రీమేక్ సినిమాలు ఎంత వద్దు అని మొత్తుకుంటున్నా చిరు పట్టించుకోకుండా రీమేక్ సినిమాల పైన ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?
Advertisement

తాజా వార్తలు