మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఈయన నటించిన ఆచార్య సినిమా విడుదల కాగా ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య వంటి వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.ఇకపోతే ప్రస్తుతం ఈయన గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమా షూటింగులతో బిజీగా ఉండి, భోళా శంకర్ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేశారు.
ఈ విధంగా భోళా శంకర్ సినిమాని పక్కన పెట్టేయడానికి ఓ కారణముంది.ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ తర్వాత సోలోగా సినిమాలలో నటించలేకపోతున్నారని ఈయనకు సపోర్టింగ్ పాత్రలలో మరొక హీరో తప్పనిసరిగా ఉండాలని భావిస్తున్నారట.
అందుకే ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సపోర్టివ్ పాత్రలో రామ్ చరణ్ నటించారు. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించగా, వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ నటిస్తున్నారు.

ఇలా మెగాస్టార్ తన ప్రతి సినిమాలోని సపోర్టింగ్ పాత్రలో మరో హీరో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో ఇప్పటివరకు మరొక హీరో గురించి ఎలాంటి ప్రకటన తెలియజేయలేదు.అయితే ఈ సినిమాలో కూడా మెగాస్టార్ కు సపోర్టింగ్ పాత్రలలో మరొక హీరో ఉండాలని భావిస్తున్నారట అందుకోసమే మేకర్స్ మరొక హీరోని వెతికే పనిలో పడ్డారు.అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సపోర్టింగ్ పాత్రలో నటించడం కోసం నితిన్ ను మేకర్స్ ఎంపిక చేసినట్లు సమాచారం.
మరి భోళా శంకర్ సినిమాలో నితిన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.







