ప్రముఖ నటుడు నరేష్ నటి పవిత్ర వ్యవహారంతో గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు.ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి.
ఇక ఈ వ్యవహారంలోకి నరేష్ మూడవ భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ వివాదం తారా స్థాయికి చేరుకుంది.అయితే ఇప్పుడిప్పుడే ఈ వివాదం ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ తాను సూపర్ స్టార్ కృష్ణకు అభిమానిని.తరచూ ఆయన ఇంట్లో పూజలు హోమాలు చేస్తూ ఉండేవాడిని.అలాగే వారి జాతకాలు కూడా నేను చెప్పానని వేణు స్వామి వెల్లడించారు.2014 సంవత్సరంలో అనుకుంటా ఓసారి కృష్ణ గారి ఇంటికి వెళ్లి 2020 సంవత్సరంలో మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారని తాను చెప్పానని వేణు స్వామి వెల్లడించారు.నేను చెప్పిన మాటలకు విజయనిర్మల గారు చాలా భయపడ్డారు అనుకున్నట్టుగానే ఆమె ముందు చనిపోయారని వేణు స్వామి వెల్లడించారు.

ఇక ఈ విషయం చెప్పిన సమయంలో నరేష్ కూడా అక్కడే ఉన్నారు.ఆయనకు అప్పుడు రమ్య రఘుపతితో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.వీరి జాతకాలు చూసి పెళ్లి చేసుకున్నా విడాకులు వస్తాయని నరేష్ కు నేను ముందే చెప్పాను.
అయినా నరేష్ నా మాట వినకుండా పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం ఫలితం అనుభవిస్తున్నారు అంటూ వేణు స్వామి వెల్లడించారు.
వీరి జాతకాల రిత్య వీరిద్దరూ విడిపోతారని నాకు తెలుసు అందుకే వీరి వివాహాన్ని నా చేతుల మీదుగా చేయలేదని వేణు స్వామి నరేష్ పెళ్లి గురించి విజయనిర్మల చావు గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.







