టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
అలాగే చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ చిత్రమైన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంగా తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.
మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించారు.
ఈ క్రమంలోనే తెలుగులో గాడ్ ఫాదర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.
త్వరలోనే సల్మాన్ ఖాన్ ఈ సినిమా షూటింగులో పాల్గొనబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా షెడ్యూల్ ముంబైలో చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేశారు.ఫిలిం ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 12వ తేదీ నుంచి ముంబైలోని ఒక ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో వారం రోజుల పాటు షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో బస చేయనున్నట్లు సమాచారం.సల్మాన్ ఖాన్ కు పన్వేల్ ఉన్న ఖరీదైన ఫామ్‌హౌస్‌లో మెగాస్టార్ చిరంజీవి బస చేయనున్నారనీ తెలుస్తోంది.దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకునీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.