భోళా శంకర్ లో ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టిన సీన్ ఇదే.. శ్రీముఖితో ఆ సీన్ ఎందుకు చేశారంటూ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటించిన భోళా శంకర్ సినిమా ఇటీవలే విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది.

ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ మీద గట్టిగానే పడింది.మెగాస్టార్ సినిమాకు మంచి మంచి స్క్రీన్లలో కూడా తొలి రోజు మార్నింగ్ షోలు ఫుల్ కాకపోవడం భోళా శంకర్ మూవీ( Bhola Shankar )కే జరిగింది.

భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులకు తీవ్ర నిరాశ మిగిలింది.సినిమా కూడా ఏదో థియేటర్లలో ఆడాలి అంటే ఆడాలి అన్నట్టుగా ప్రదర్శితమవుతుండడంతో మెగా అభిమానులే తట్టుకోలేక నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.

సినిమాలో క్రింజ్ అనిపించే సీన్ లకు డైలాగులకు లోటే లేదు.చిరంజీవి పెర్ఫామెన్స్, ఆయన డ్యాన్సులు, ఫైట్లు కూడా సినిమాను కాపాడే పరిస్థితి లేదని థియేటర్ల నుంచి బయటికి వస్తున్న ప్రేక్షకుల స్పందనను బట్టి అర్థమవుతోంది.అభిమానులను ప్రేక్షకులను ఈ సినిమాలో ఇబ్బంది పెట్టే సన్నివేశం కూడా ఒకటి ఉందట.

Advertisement

అదే ఖుషి సినిమా నడుము సీన్( Khushi Movie Scene ) ని రీ క్రియేట్ చేయడం.ఇప్పటికే ఆ సన్నివేశాన్ని చాలా చిత్రాల్లో పేరడీ చేయడం చూశాము.

అవన్నీ చాలా వరకు కమెడియన్లు చేసినవే.కానీ చిరంజీవి స్థాయికి ఏం అవసరం వచ్చిందని ఈ సీన్‌కు పేరడీ చేయాలనుకున్నారో తెలియదు.

పవన్‌ మెడ రుద్దుకుంటూ హ హ అనే మేనరిజం( Pawan Kalyan Mannerism )ను అనుకరిస్తూ ఇంతకుముందు ఒక బిట్ వదిలినపుడే నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది.చిరు స్థాయికి ఇలాంటివి అవసరమా అని మెగా అభిమానుల నుంచే ప్రశ్నలు తలెత్తాయి.ఇక సినిమాలో అయితే ఖుషి నడుము సీన్‌ ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు.

అది చాలా ఎబ్బెట్టుగా అనిపించేలా ఆ సీన్ తీయడంతో అదెప్పుడు ముగిసిపోతుందా అన్న ఫీలింగ్ కలిగింది.చిరు ఈ వయసులో ఇలాంటి సీన్ చేయడం అందులో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఆయన్ని ఎంతగానో అభిమానించే కుటుంబ ప్రేక్షకులకు ఏ మాత్రం రుచించే అవకాశం లేదు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

మొత్తానికి భోళా శంకర్ సినిమా అభిమానులను మెప్పించలేకపోయింది.

Advertisement

తాజా వార్తలు