మెగా ప్రిన్స్ వరుణ్ 'గని' ప్రివ్యూ

వరుణ్ తేజ్‌ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన గని సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది.

ఈ మధ్య కాలంలో సినిమాలు వాయిదా పడటం అనేది చాలా కామన్ విషయం.కానీ ఈ సినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సార్లు వాయిదా పడి ఎనిమిదో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

రేపు ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి.ఈ సినిమా లో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాతో అల్లు ఫ్యామిలీ నుండి అల్లు బాబీ నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు.

Advertisement

అల్లు అరవింద్ ఇప్పటికే ఎన్నో సినిమాలు నిర్మించి సూపర్ హిట్ నిర్మాతగా నిలిచాడు.ఆయన వారసుడిగా బాబీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు.స్నేహితుడు కమ్‌ బంధువు అయిన సిద్దు తో కలిసి ఈ సినిమాను బాబీ నిర్మించాడు.

అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తన అనుభవంతో అల్లు అరవింద్ ఈ సినిమా కు పలు సలహాలు సూచనలు చేసినట్లు సమాచారం అందుతోంది.

ఇక కథ విషయానికి వస్తే బాక్సింగ్ తో పాటు సెంటిమెంట్ మరియు ఎమోషన్ కూడా సమపాళ్ళలో చూపిస్తూ ఆసక్తికరంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించినట్లు సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లుగా కూడా సమాచారం అందుతోంది.

మొత్తానికి భారీగా ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎలా ఉంటుందో అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వరుణ్ మరియు సాయి మంజ్రేకర్ ల కాంబోలో వచ్చే సన్నివేశాలు మరియు సెంటిమెంట్ సన్నివేశాలు ఫైనల్ గా బాక్సింగ్ సన్నివేశాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేస్తాయి అంటూ మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

సినిమా ఎలా ఉంది అనే విషయం తెలియాలంటే రేపు అందరి కంటే ముందు మేము ఇవ్వబోతున్న రివ్యూ చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు