R R R లో తార‌క్ రోల్‌ డామినేష‌న్‌పై మెగా టెన్ష‌న్ ప‌ట్టుకుందా..!

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా తెర‌కెక్కిస్తోన్నారు.ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా నటిస్తుంటే.

ఎన్టీఆర్ కొమ‌రం భీంగా న‌టిస్తున్నాడు.ఈ ఇద్ద‌రు క్రేజీ హీరోలు క‌లిసి న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే ఇద్ద‌రి న‌ట‌న మ‌ధ్య పోలిక ఉంటుంది.

ఎన్టీఆర్ పాత్ర బాగా హైలెట్ అయ్యిందా ?  లేదా రామ్‌చ‌ర‌ణ్ పాత్ర హైలెట్ అయ్యిందా ? ఇద్ద‌రిలో ఎవ‌రు డామినేట్ చేశారు ?  ఎవ‌రి న‌ట‌న బాగుంది ? ఇలాంటి పోలిక‌లు రావ‌డం స‌హ‌జం.రాజ‌మౌళి ఇద్ద‌రి పాత్ర‌ల‌ను స‌మ‌తూకంతో తెర‌కెక్కించినా రేపు సినిమా రిలీజ్ అయ్యాక విమ‌ర్శ‌కులు, ప్రేక్ష‌కులు మాత్రం పోలిక పెట్టి ఎవ‌రి పాత్ర డామినేట్ అయ్యిందో ?  ఎవ‌రు బాగా చేశారో ఎవ‌రికి తోచిన‌ట్టు వారు చెపుతూ ఉంటారు.స‌హ‌జంగా ఈ ఇద్ద‌రు హీరోల సినిమాలు చూస్తే ఎన్టీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌లు ఎక్కువ హైలెట్ అయ్యాయి.

రంగ‌స్థ‌లం సినిమాతో రామ్‌చ‌ర‌ణ్ కూడా త‌న స‌త్తా ఏంటో చూపించుకున్నాడు.అయితే ఎన్టీఆర్ పౌరాణికం, సాంఘీకం రెండు పాత్ర‌లు అల‌వోక‌గా చేసేస్తాడు.ఇదే ఇప్పుడు మెగా అభిమానుల‌కు టెన్ష‌న్‌గా మారింద‌ట‌.

Advertisement

ఎన్టీఆర్ న‌ట‌న ముందు చ‌ర‌ణ్ స‌రితూగుతాడా ?  లేదా తేలిపోతాడా ?  అన్న ప్ర‌శ్న‌లు వీరిని వెంటాడుతున్నాయ‌ట‌.రంగ‌స్థ‌లంలో చేసిన త‌ర‌హాలో చెర్రీ న‌టిస్తే ఎన్టీఆర్‌కు ఆర్ ఆర్ ఆర్‌లో పోటీ ఇచ్చిన‌ట్టే అవుతుంది.ఇక ఇద్ద‌రూ ఎంత పోటాపోటీగా నటించినా.

రాజ‌మౌళి ఇద్ద‌రి పాత్ర‌ల‌ను బ్యాలెన్స్ చేయ‌డం కూడా స‌వాల్ లాంటిదే.ఆర్ ఆర్ ఆర్‌లో చ‌ర‌ణ్ ఇంట్రో టీజ‌ర్లో మాత్రం చ‌ర‌ణ్ త‌న న‌ట‌న‌తో దుమ్ము రేపాడు.

మ‌రి రేపు ఆన్ స్క్రీన్ మీద ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఎంత పోటాపోటీగా న‌టించారో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest
Advertisement

తాజా వార్తలు