జో బిడెన్ జీవితంలో కాంతి రేఖ: జిల్ గురించి మీలో ఎంత మందికి తెలుసు..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.

ఆయన అగ్రరాజ్యానికి అధినేత అయిన దగ్గరి నుంచి ఆమె మనందరికీ సుపరిచితమే.

అంతకుముందే టాప్ మోడల్‌గా అక్కడ బాగా పాపులర్.ఇక తాజా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్ధి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ భార్య గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే.

బిడెన్ కి విదేశీ వ్యవహారాల నిర్వహణ పట్ల అవగాహన, సుదీర్ఘ రాజకీయ అనుభవం, సాధారణ ప్రజానీకాన్ని మెప్పించగలిగే వాక్చాతుర్యం, జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న అనుభవం ఉన్నాయని ఆయన మద్దతుదారుల అభిప్రాయం.కానీ బిడెన్ నిజమైన బలం ఆయన సతీమణి జిల్ బిడెనే.

ఆయన తొలి సారి సెనెట్ కి ఎన్నికైన వెంటనే ఒక కారు ప్రమాదంలో భార్య, కూతురుని కోల్పోయారు.అయన ఇద్దరు కొడుకులకి తీవ్రంగా గాయాలయ్యాయి.

Advertisement

ఒక కొడుకు 46 సంవత్సారాలకే 2015 లో బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు.అతని మరో కుమారుడు హంటర్ పై మాత్రం మాదక ద్రవ్యాలు తీసుకుంటారని , అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.

తొలి భార్యను, కుమార్తెను కోల్పోయి.ఇద్దరు కొడుకులతో చిన్న వయసులోనే ఒంటరిగా మిగిలిన జీవితంలోకే కాకుండా ఆయన చిన్నారులకు మాతృమూర్తిగా జిల్ అడుగుపెట్టారు.

ఓ వైపు సంసార బాధ్యతలు చూసుకుంటూనే రెండు మాస్టర్ డిగ్రీలను పొందారు.ప్రస్తుతం వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఎనిమిదేళ్లు అమెరికా ద్వితీయ మహిళగా ఉన్నా తన వృత్తిని వీడలేదు.మహిళలు వ్యక్తిగత, వృత్తిగత బాధ్యతలను నిర్వహించటం అమెరికాలో సర్వసాధారణమే అయినా ప్రథమ మహిళ విషయంలో ఇప్పటి వరకు ఈ విధంగా జరగలేదు.69 ఏళ్ల జిల్ బిడెన్ ఫిలడెల్ఫియాలోని పల్లే ప్రాంతాల్లో పుట్టి పెరిగారు.ఆమె తండ్రి సాధారణ క్లర్క్ స్థాయి నుంచి బ్యాంక్ అధినేతగా ఎదిగారు.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
పోలవరం కోసం విదేశీ నిపుణులు రప్పిస్తున్నాం సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!!

జిల్.తొలుత మోడలింగ్‌పై మక్కువ చూపినా.

Advertisement

అనంతరం ఉన్నత విద్యపై అడుగులు వేసి.మాస్టర్స్ డిగ్రీని, డాక్టరేట్‌ను కూడా పూర్తి చేశారు.

బిడెన్ రెండు సార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయినా.ఎనిమిదేళ్ల పాటు ఉపాధ్యక్షుడిగా ఉన్నా జిల్ ఆయన వెన్నంటే నడవటంతో పాటు బిడెన్‌కు సలహాదారుగా నిలిచారు.

రాజకీయాలు పక్కనబెడితే.జిల్ బిడెన్ ‘ బ్రెస్ట్ హెల్త్ ఇన్షియేటివ్ ’ అనే కార్యక్రమంలో భాగంగా ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

పేద పిల్లలకు ‘‘ బుక్ బడ్డీస్ ’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.‘‘ వేర్ ద లైట్ ఎంటర్స్’’ పేరిట తన స్వీయ చరిత్ర రాసిన జిల్ రచయిత్రిగా మరో కోణాన్ని బయటపెట్టారు.

తాజా వార్తలు