ఆర్ఎంపీ కూతురికి ఎంబీబీఎస్ లో సీటు - పలువురి అభినందనలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓ ఆర్ఎంపీ కూతురు ఎంబీబీఎస్ లో సీటు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది.

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణ పూర్ గ్రామానికి చెందిన పాముల శ్రీనివాస్ లత దంపతుల కూతురు పావని నీట్ లో ప్రతిభ కనబరిచి పటాన్ చెరులోని టీఆర్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబీబీఎస్ సీటు సాధించింది.

తండ్రి శ్రీనివాస్ ఆర్ఎంపీ వైద్యుడు, తల్లి లత గృహిణి.పావని పదో తరగతి వరకు మండలం లోని విజ్ఞాన్ స్కూల్ లో, ఇంటర్ హైదరాబాద్ నారాయణ కళాశాలలో చదివినట్లు పేర్కొన్నారు.

తన తండ్రి పాతికేండ్లుగా వైద్య సేవలు అందిస్తున్నాడు.అది చూసి లక్ష్యాన్ని పెట్టుకున్న కూతురు ఎంబీబీఎస్ లో సీటు సాధించి నాన్న కలను నెరవేర్చింది.

పీ జీలో స్పెషలైజే షన్ చేసి పేదలకు వైద్య సేవలందిస్తానని విద్యార్థి పావని తెలిపారు.తన కుమారుడు పవన్ సాయి కూడా ఎంబీబీఎస్ చేస్తుండడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

విద్యార్థులను పలువురు గ్రామస్తులు అభినందించారు.

నల్లటి వలయాలను మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ రెమెడీస్ ఇవే!
Advertisement

Latest Rajanna Sircilla News