పూర్వీకుల కోసం ఇండియాకు వచ్చిన ఎన్నారై.. ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు!

సాధారణంగా వేరే దేశంలో నివసిస్తున్నా స్వదేశానికి వచ్చి కుటుంబ సభ్యులతో సమయం గడపాలని ఎన్నారైలకు ఎప్పుడూ ఉంటుంది.

ఎప్పుడో వేరే దేశాలకి వలసపోయిన వారు ఇండియాలో తమ కుటుంబ సభ్యులు ఉన్నారా లేదా అనేది కూడా తెలుసుకోవాలని తపన పడుతుంటారు.

ఇలాంటి తపనతోనే తాజాగా ఒక ఎన్నారై( NRI ) ఇండియాకి వచ్చాడు.

Mauritian Nri Reaches Bihar Village To Trace His Roots After 164 Years,dharmadev

మారిషస్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ధర్మదేవ్ నిర్మల్ హరి( Dharmadev Nirmal Hari ) బిహార్‌లోని తన పూర్వీకుల గ్రామాన్ని తాజాగా సందర్శించాడు.అతని పూర్వీకులు మారిషస్‌లో ఒప్పంద కార్మికులుగా పనిచేయడానికి 1859లో గ్రామాన్ని విడిచిపెట్టారు.అయితే ధర్మదేవ్ గ్రామంలో తన కుటుంబ సభ్యులెవరినీ కనుగొనలేకపోయాడు, కానీ గ్రామస్తుల ప్రేమ, కరుణకు ఫిదా అయ్యాడు.

గ్రామాన్ని సందర్శించిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చినట్లు అనిపించిందని తెలిపారు.ధర్మదేవ్ వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు అతని చుట్టూ గుమి గూడారు.సంత కుటుంబ సభ్యులకు చేసినంతగా మర్యాదలు చేశారు.ధర్మదేవ్ పూర్వీకుడైన హరి 1859లో మారిషస్ తరలిపోయాడు.10 సంవత్సరాల తర్వాత తులసి అనే మహిళను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు.అయితే వారు మాత్రమే కాకుండా అతనికి చెందిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఇండియాలోనే మిగిలిపోయారా అనే కోణంలో సదరు ఎన్నారై చాలాసేపు అన్వేషించాడు కానీ ఫలితం లేకుండా పోయింది.

Mauritian Nri Reaches Bihar Village To Trace His Roots After 164 Years,dharmadev
Advertisement
Mauritian NRI Reaches Bihar Village To Trace His Roots After 164 Years,Dharmadev

ఇకపోతే 2007లో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్( Bihar CM Nitish Kumar ) మారిషస్‌ను సందర్శించి, మారిషస్ ఎన్నారై( Mauritian NRI )లను బిహార్‌కు వచ్చి తమ పూర్వీకుల గ్రామాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.ఆ ఆహ్వానాన్ని స్వీకరించిన వారిలో ధర్మదేవ్ ఒకరు.తనకు గ్రామంలో తన కుటుంబ సభ్యుల ఆచూకీ లభించకపోయినా.

తన పూర్వీకుల ప్రదేశాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ధర్మదేవ్ అన్నారు.ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను మారిషస్‌కి తీసుకెళ్తానని, వాటిని తన కుటుంబ సభ్యులతో పంచుకుంటానని చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు