ఉత్తరప్రదేశ్ కాన్పూర్‎లో భారీ చోరీ..!

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో భారీ చోరీ జరిగింది.సొరంగ మార్గం తవ్విన గుర్తు తెలియని దుండగులు ఓ బ్యాంకులో దొంగతనానికి పాల్పడ్డారు.

ఎస్బీఐ బ్యాంకు పక్క స్థలం నుంచి బ్యాంకులోకి సొరంగం తవ్వినట్లు పోలీసులు గుర్తించారు.సుమారు పది అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో దొంగలు సొరంగాన్ని తవ్వారని తెలిపారు.

అనంతరం రూ.కోటి విలువైన 1.8 కేజీల బంగారాన్ని అపహరించుకుని వెళ్లారు.సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

అయితే బ్యాంకు గురించి పూర్తిగా తెలిసిన వాళ్లే దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు