జాకెట్ బాగా కుట్టి పెట్టాడని టైలర్ తో అఫైర్ పెట్టుకున్న ఆంటీ... చివరికి అంకుల్ ని కూడా...

ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని సైతం కడతేర్చడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.

కాగా తాజాగా ఓ వివాహిత బట్టలు కుట్టే లేడీస్ టైలర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని ఏకంగా తన భర్తనే కడతేర్చటానికి కూడా వెనకాడనటువంటి ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే కోడంబాకం ప్రాంతంలో రంజిత్ అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో నివాసముంటున్నాడు.అయితే రంజిత్ తన కుటుంబ పోషణ నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఉద్యోగం నిమిత్తం తరచూ ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉండేవాడు.అయితే ఇటీవలే రంజిత్ భార్య సునయన స్థానికంగా ఉన్నటువంటి లేడీస్ టైలర్ దగ్గరికి బట్టలు కుట్టించుకోవడానికి వెళ్ళింది.

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.దీంతో అతికొద్ది సమయంలోనే లేడీస్ టైలర్ కి మరియు సునయనకి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

Advertisement
Married Women Extramarital Affair With Ladies Tailor And Killed Her Husband, Mar

ఈ క్రమంలో రంజిత్ ఇంట్లో లేనప్పుడు సునయన మరియు తన ప్రియుడు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవారు.దీంతో ఈ విషయం తెలుసుకున్న రంజిత్ తన భార్యను మందలించి వేరే ప్రాంతానికి మకాం మార్చాడు.

అయినప్పటికీ సునయన మాత్రం తన తీరు మార్చుకోకుండా తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగింది.

Married Women Extramarital Affair With Ladies Tailor And Killed Her Husband, Mar

కాగా ఇటీవలే మరోమారు రంజిత్ బయటకు వెళ్ళిన సమయంలో ఆయన తన ప్రియుడిని పిలిపించుకుని బెడ్రూంలో ఎంజాయ్ చేస్తుండగా రంజిత్ కంట పడింది.దీంతో ఆవేశానికి గురైన రంజిత్ తన భార్యని హతమార్చేందుకు యత్నించగా సునయన తన ప్రియుడి సహాయంతో రంజిత్ ని దారుణంగా హత్య చేసింది.దీంతో భయబ్రాంతులకు గురయిన సునయన ప్రియుడు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సునయన ని అదుపులోకి తీసుకుని విచారించగా తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఆమె తన భర్తని హతమార్చినట్లు నేరం అంగీకరించింది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు