పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తలను తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఖండించారు.తాను ఢిల్లీకి రావడం కొత్తేమి కాదని చెప్పారు.
బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారని వెల్లడించారు.
తాను రాజకీయాల్లోనే ఉన్నానన్న శశిధర్ రెడ్డి… రిటైర్డ్ కాలేదని తెలిపారు.