టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యాంకర్ లాస్య గురించి అందరికి పరిచయమే.ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్ గా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది లాస్య.
ముఖ్యంగా చీమ, ఏనుగు ల జోక్స్ చెబుతూ అందరినీ బాగా ఆకట్టుకుంది.యాంకర్ ఫీల్డ్ లో ఉన్నంతకాలం పద్ధతిగా కనిపించి మరింత మార్కులు సంపాదించుకుంది.
కానీ అంతలోనే యాంకర్ గా పుల్ స్టాప్ పెట్టేసింది.చూసే వారికి యాంకర్ అంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా చేసింది లాస్య.
కానీ గతంలోనే లాస్య యాంకర్ గా బాధ్యతలను ముగించుకుంది.అప్పట్లో యాంకర్ రవి తో కలిసి కొన్ని షో లలో చేసి బాగా సందడి చేసింది.
కేవలం బుల్లితెరపై షో లలోనే కాకుండా ఎం యల్ ఏ, రాజ మీరు కేక, స్వాతి ఐ లవ్ యు వంటి చిత్రాలలో వెండి తెరపై నటించి తనదైన నటనను కనబరిచింది.
ఇక అప్పట్లో రవితో రిలేషన్ లో ఉన్నట్టు బాగా వార్తలు వచ్చాయి.
కానీ అవన్నీ పుకార్లే అని తర్వాత కు తెలిసాయి.పైగా లాస్య యాంకర్ గా దూరం కావడానికి కారణం యాంకర్ రవి అని వార్తలు వచ్చాయి.
కానీ అందులో ఎంత నిజం ఉందో ఎవరికి తెలియదు.ఇక ఇండస్ట్రీకి దూరంగా ఉండి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మంజునాథ్ చిల్లాలేను పెళ్ళి చేసుకుంది.
ముఖ్యంగా తన పెళ్లి విషయంలో మాత్రం బాగా వైరల్ గా మారింది.

పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగానే ఉంది.ఇక సోషల్ మీడియా ద్వారా మరోసారి తన అభిమానులకు దగ్గర మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.అంతేకాకుండా బిగ్బాస్ 4 సీజన్ లో కూడా అవకాశం అందుకుంది.
హౌస్ లో ఉన్నంతకాలం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది లాస్య.

ఇక సోషల్ మీడియాలో తన భర్తతో చేసే ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇక తనకు ఒక బాబు కూడా ఉన్న సంగతి తెలిసిందే.మళ్లీ మరోసారి ప్రెగ్నెంట్ కూడా అయ్యింది.
ఈ విషయాన్ని తను ఆ మధ్యనే తెలిపింది.అంతేకాకుండా ఆమధ్య మళ్లీ బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది లాస్య.
పైగా తన భర్త మంజునాథ్ తో కలిసి చాలా షోలో పాల్గొని బాగా సందడి చేసింది.ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ ప్రదీప్ చేస్తున్న లేడీస్ అండ్ జెంటిల్మెన్ షో లో తన భర్తతో పాల్గొంది.
తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.అందులో సీరియల్ ఆర్టిస్ట్ లు మేఘన దంపతులు, సీరియల్ నటుడు అకుల్ బాలాజీ దంపతులు, యాంకర్ లాస్య, మంజునాథ్ జంటగా పాల్గొన్నారు.
ఇక వాళ్ళు బాగా సందడి చేయగా అందులో లాస్య ప్రెగ్నెంట్ అని మేఘన, జ్యోతి.లాస్య దంపతులకు బొట్టు పెట్టి చీర, సారె అందించారు.
దీంతో లాస్య ఎమోషనల్ అయినట్లు కనిపించింది.ఇక ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ అవుతుంది.







