మామూలుగా దొంగతనాలు చేసే వాళ్ళు సమయం చూసి సందర్భం చూసి దొంగతనాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు.మామూలుగా రష్ గా ఉండే ప్రదేశాలను ఎంచుకుంటారు.
జేబుదొంగలు మాత్రం ఈ మధ్య బాగా ఎక్కువయ్యారు.ఎటువంటి కష్టాలు చేయకుండా వీటికి అలవాటు పడుతూ అమాయకుల కడుపులను కాజేస్తున్నారు.
తాజాగా సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్రలకు వచ్చిన అభిమానులను టార్గెట్ చేశారు జేబు దొంగలు. ఫుల్ రష్ గా ఉండే ప్రదేశం కావడంతో అక్కడికి వచ్చిన అభిమానుల జేబులను కాజేయడానికి ప్లాన్ చేశారు.
ఓవైపు తమ అభిమాన హీరో చనిపోయారు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక అభిమానులు బాగా రోదిస్తున్నారు.పైగా తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోలేనంత బాధలో ఉన్నారు.
దీంతో ఈ ఆసర ను చూసుకొని జేబుదొంగలు ఓ పట్టు పట్టారు.అభిమానుల మధ్యలో చేరి తాము కూడా అంతిమయాత్రకు వచ్చినట్లుగా నటించి గుంపుల్లో దొంగతనాలు చేశారు.
ఇక కృష్ణ అభిమానులు భారీ స్థాయిలో నానక్ రామ్ గూడకి తరలిరాగా అక్కడ ఆయన నివాసం దగ్గర చుట్టుముట్టారు.ఈ నేపథ్యంలో అక్కడ బాగా రద్దీ ఏర్పడింది.
దీంతో పలువురు జేబుదొంగలు దొంగతనం చేయగా చివరికి తెలుసుకున్న అభిమానులు తమ సొమ్ము పోగొట్టుకున్నాము అంటూ లబోదిబోమన్నారు.తమ సెల్ ఫోన్లు కనిపించడం లేదు అంటూ, పర్సులు కనిపించడం లేదు అంటూ వాపోయారు.
ఇక అక్కడ కొందరిపై అనుమానం రావటంతో వాళ్ళని పట్టుకొని గట్టిగా నిలదీశారు.

దీంతో ఇరువురి మధ్య సంఘర్షణ ఏర్పడగా అది కాస్త పెద్దగా మారింది.ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది.ఇక గుంపులో ఎవరు ఎవరితో గొడవ పడుతున్నారు అనేది అక్కడున్న పోలీసులకు కూడా అర్థం కాకుండా మారింది.
దీంతో వెంటనే పోలీసులు వారిని అప్రమత్తం చేయగా.అప్పటికే ఆ దొంగలు పారిపోవచ్చు అని కొందరు భావించారు.
ఇక తమ సొమ్మును కోల్పోయిన బాధితులు.అటు తమ అభిమాన హీరో మరణాన్ని తట్టుకోలేక.మరోవైపు తమ వస్తువులు పోగొట్టుకొని మరింత బాధపడుతున్నారు.ఇక సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్రలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులంతా తరలివస్తున్నారు.

ఇంత మంచి నటుడిని కోల్పోయాము అని.చాలా బాధపడుతున్నారు.ఇక మరి కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.ఒక తరం ముగిసింది అంటూ సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ లను తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు.
అంతేకాకుండా వరుస మరణాలతో కుటుంబ సభ్యులను కోల్పోయిన మహేష్ బాబుని చూసి ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.నీకే ఎందుకిలా జరుగుతుంది అన్నా అంటూ.
ధైర్యంగా ఉండు అంటూసోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు అభిమానులు ధైర్యం ఇస్తున్నారు.ఇక ప్రస్తుతం కృష్ణ అంతిమయాత్ర జరుగుతున్న సంగతి తెలిసిందే.







