దీపావళి పండుగ కు ఎన్నో రోజుల ముందు నుంచి ఇంట్లో పండగ వాతావరణం మొదలయ్యే ఉంటుంది.ఎందుకంటే బంధువులకు ఎలాంటి బహుమతులు ఇవ్వాలి.
మిఠాయిలు ఏమి చేయాలి, పూజకు అవసరమైన వస్తువులు అన్నీ కూడా ఇంటికి తెచ్చే పని చేస్తుంటారు.పండుగకు బంధువులు స్నేహితులు రావడం వల్ల ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది.
వాళ్ల కోసం ఎటువంటి వంటలు, పానీయాలు ఏర్పాటు చేయాలని పండుగ వచ్చిందంటే ఇంటికి సంతోషాలని కాకుండా ఒక రకమైన రోగం కూడా వచ్చినట్లే.
మరీ పండుగ ఆనందాన్ని ఆరోగ్యం కోసం దూరం చేసుకోవాల్సిన పనిలేదు.
కాకపోతే బయట వండినా మిఠాయిలు వంటకాలు కాకుండా ఇంట్లోనే తాజాగా భోజనం వండుకొని తినడం మంచిది.ఆరోగ్యాకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
పండుగ వేళ సమయంలో వచ్చే కొన్ని సాధారణ సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి అంటే రుచికరమైన ఎన్నో రకాల మిఠాయిలు చేసి ఉంచుతారు.
బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది.బంధువులు స్నేహితుల రాకతో ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది.
ఇటువంటి సమయంలో ఎక్కువగా తీసుకునే పదార్థాలు మిఠాయిలు మాత్రమే.వీటిని తెలియకుండానే ఎక్కువగా తిని జీర్ణ సమస్యలు వస్తాయి.
ఇలా జరిగినప్పుడు బయటి ఆరోపదార్థాలను తినడం వల్ల ఫుడ్ పాయిజన్, వాంతులు లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
దీపావళి పండుగ అంటే వారం ముందు నుంచే పిల్లలు క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.దానివల్ల గాలిలోకి ఎక్కువగా పొగ కలుస్తూ ఉంటుంది.చలికాలం మొదలవడంతో కాలుష్యపు పొగ వల్ల గాలి కలుషితం అవుతుంది.
ఇలాంటి సమయాలలో వాతావరణ కాలుష్యం వల్ల శ్వాస కోస సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది.అంతేకాకుండా ఈ బాణాసంచా పేల్చడం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగి అభం శుభం తెలియని చిన్న పిల్లలు గాయాల పాలవుతున్నారు.
పెద్దవాళ్లు పిల్లలకు నచ్చజెప్పి వాటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండేలా చూసుకోవడం కూడా మంచిదే.