మన మంగరాణి టీచర్‌ దేశ వ్యాప్తంగా ఫేమస్‌ అయ్యింది.. 50 వేల మందికి ఆమె పాఠాలు, మరి మీరు ఆమె పాఠాలు వింటారా?

ప్రభుత్వ ఉద్యోగం అంత సుఖమైన ఉద్యోగం మరోటి లేదు అనేది ప్రతి ఒక్కరి మాట.

ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌గా ఉద్యోగం చేయడం వల్ల అన్ని రకాలలుగా ఉపయోగదాయం, సుఖదాయం అంటారు.

ఉదయం 9 గంటల నుండి సాయత్రం 4 గంటల వరకు స్కూల్‌, ఆ తర్వాత ఖాళీ, వేసవి సెలవు, ఇంకా ఏవో ఏవో సెలవులు ఉంటూనే ఉంటాయి.అందుకే ఎక్కువ శాతం మంది ప్రభుత్వ టీచర్‌ జాబ్‌ల కోసం ఆరాటపడుతూ ఉంటారు.

ప్రభుత్వ టీచర్‌లలో ఎక్కువ శాతం మంది పాఠాలు చెప్పకుండా ఇతర పనులు చూసుకుంటారు అంటూ విమర్శలు ఉన్నాయి.అయితే కొందరు మాత్రం కార్పోరేట్‌ స్థాయిలో తాను పని చేసే స్కూల్‌లో పిల్లలు అభివృద్ది చెందాలని భావిస్తూ ఉంటారు.

అందులో ఒకరు మంగరాణి టీచర్‌.

Advertisement

తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈమె రాజమండ్రిలోని శ్రీనాగరాజ మున్సిపల్‌ హై స్కూల్‌లో జాబ్‌ చేస్తోంది.ఈమె స్కూల్‌కు వెళ్లామా, పిల్లలకు నాలుగు ముక్కలు పాఠాలు చెప్పామా, వచ్చామా అని కాకుండా కొంత విభిన్నంగా ఉండాలనే ఆలోచన చేసింది.ఆ ఆలోచనలో భాగంగానే ఆరు సంవత్సరాల క్రితం యూట్యూబ్‌లో మంగరాణి లెసెన్స్‌ అంటూ ఒక ఛానెల్‌ను క్రియేట్‌ చేసింది.

ఆ సందర్బంగా పిల్లల కోసం పాఠాల వీడియోలు చేసి పోస్ట్‌ చేయడం ప్రారంభించింది.తాను పని చేస్తున్న స్కూల్‌ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆ వీడియో ఛానెల్‌ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్‌ అయ్యింది.

దాదాపుగా 50 వేల మంది మంగరాణి మేడమ్‌ పోస్ట్‌ చేసే వీడియోల కోసం సబ్‌స్క్రైబ్‌ అయ్యారు.ఈమె చేస్తున్న వీడియోలకు మంచి వ్యూస్‌ వస్తున్నాయి.

పిల్లలకు చిన్న చిన్న విషయాల్లో ట్రైనింగ్‌ ఇచ్చేందుకు మగరాణి మేడమ్‌ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం అంటూ ఎంతో మంది అభినందనలు కురిపిస్తూ ఉంటారు.ఇక తాను పని చేసే స్కూల్‌ లో కూడా పిల్లలకు అత్యంత క్రియేటివిటీగా పాఠాలు నేర్పిస్తూ, వారికి ప్రయోగాలు చేయిస్తూ వారే స్వయంగా నేర్చుకునేలా చేస్తున్నారు.అందుకే ఆ స్కూల్‌ పిల్లలు అంతా కూడా మంగరాణి మేడమ్‌ అంటే తమకు చాలా ఇష్టం అంటూ చెబుతూ ఉంటారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

స్కూల్‌లో పాఠాలు చెప్పి అలసి పోయి వచ్చి ఇంత తిని రెస్ట్‌ తీసుకుందాం అనుకోకుండా మంగరాణి మేడమ్‌ రాత్రి పొద్దు పోయే వరకు వీడియోలు చేసుకుంటూ ఉంటారు.కంప్యూటర్స్‌ లో డిగ్రీ చేసిన ఈమె కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇదంతా సాధ్యం అంటుంది.

Advertisement

ప్రభుత్వం సహకారం అందిస్తే పిల్లల కోసం ఇంకా మంచి పాఠాలను యూట్యూబ్‌ ద్వారా అందిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

యూట్యూబ్‌ ద్వారా పెద్దగా ఆదాయం ఏమీ లేదని, నలుగురికి తన పాఠాలు జ్ఞానం నేర్పానే ఉద్దేశ్యంతో తాను ఈ పని చేస్తున్నట్లుగా ఆమె పేర్కొంది.డబ్బును ఆశించకుండా నలుగురికి ఉపయోగపడేలా యూట్యూబ్‌ పాఠాలు చేస్తున్న మంగరాణి మేడం నిజంగా గ్రేట్‌.

తాజా వార్తలు