మోహన్ బాబు సినిమాకు 'స్టైలిస్ట్'గా విష్ణు భార్య.. ఏ సినిమాకంటే?

టాలీవుడ్ సినీయర్ హీరో, కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ”సన్‌ ఆఫ్‌ ఇండియా”.ఎన్నో ఏళ్ల తర్వాత హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంకు సంబంధించి ఇప్పటికే పోస్టర్ విడుదల అయ్యింది.

 Viranika Styling For Manchu Mohanbabu Son Of India, Mohan Babu, Viranika Stylin-TeluguStop.com

అలాంటి ఈ సినిమాలో నటిస్తున్న మోహన్ బాబుకు స్టైలిష్ట్‌గా మంచు విష్ణు సతీమణి వెరోనికా వ్యవహరించనున్నారు.

మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కథ ఎంతో విభిన్నంగా ఉండనుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఈరోజు హైదరాబాద్ లోని మోహన్ బాబు నివాసంలోనే ప్రారంభమైంది.ఇక ఈ సినిమాకు దర్శకుడిగా డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ సినిమాని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మంచు విష్ణు నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈరోజు ప్రారంభం కావడంతో మోహన్ బాబుకి మంచు లక్ష్మి మోహన్ బాబు కూతురు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్ చేసారు.

కంగ్రాట్స్ డాడీ.ఈ సినిమా కోసం నేను ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న.

మీ అద్భుతమైన నటనను వెండితెరపై మరోసారి చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న.ఆల్ ది బెస్ట్ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.ఇప్పుడు సినిమా షూటింగ్ లు అన్ని పునః ప్రారంభం కావడంతో మళ్లీ సినిమా షూటింగ్ ప్రారంభించారు.

ఇక మరో వైపు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కూడా మూడేళ్ల తర్వాత ఓ సినిమా గురించి ప్రకటించాడు.

అదే అహం బ్రహ్మాస్మి.

ఈ సినిమా గురించి ఇంత వరకు ఎటువంటి అప్డేట్ లేదు.అయితే మోహన్ బాబు ఇప్పుడు సినిమా ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ట్విట్టర్ వేదికగ మంచు మనోజ్ కూడా ఓ సినిమా తేలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube