మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలను మంచు ఫ్యామిలీ వారు చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటి వరుకు ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఎవరు కూడా ఈ స్థాయిలో పోటీకి ప్రయత్నించింది లేదు.
గెలుపు కోసం తపించింది లేదు.మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో మొదట ఆయన తండ్రి నుండి అంగీకారం పొందాడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
మంచు విష్ణు పంతంకు పోయి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడేమో కాని మోహన్ బాబుకు ఈ ఎన్నికలు ఆసక్తి లేకపోవచ్చు అంటూ కొందరు కామెంట్స్ చేశారు.అయితే ఏం జరిగిందో ఏమో కాని ఒక వ్యక్తి చేసిన కాల్ వల్ల తన కొడుకు మా అధ్యక్షుడిగా గెలవాలనే పట్టుదలను ఆయన పట్టుకున్నాడు.
విష్ణు బాబును ఖచ్చితంగా మా ప్రెసిడెంట్ గా చేస్తాను అంటూ భీష్మించాడు.

ఈ ఎన్నికల ప్రచారం లో మోహన్ బాబు మాట్లాడక పోవచ్చు అని అంతా అనుకున్నారు.కాని ఆయన స్వయం గా ప్రచారం లో పాల్గొంటున్నాడు.ఆయన తాజాగా కృష్ణ వద్దకు వెళ్లి తన కొడుకు కు ఆశ్వీర్వాదం ఇప్పించాడు.
మంచు విష్ణు ప్యానల్ ను సమర్థించాలంటూ విజ్ఞప్తి చేశాడు.ఈ విషయంలో కృష్ణ సానుకూలంగా స్పందించాడనే వార్తలు వస్తున్నాయి.
ఆయన ఇంట్లోనే చాలా ఓట్లు ఉన్నాయి.కనుక కృష్ణ కనుక మంచు విష్ణు వెనుక ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ గా ఫలితం వస్తుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మంచు విష్ణు కు ప్రత్యర్థి గా ప్రకాష్ రాజ్ ఉన్నాడు.ఆ ప్యానల్ లో మెగా ఫ్యామిలీ కి చెందిన పలువురు ఉన్నారు.
కనుక ఖచ్చితంగా రెండు ప్యానల్స్ మద్య పోటీ రసవత్తరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.