తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోహన్ బాబు హీరో గా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు…ఇక ఆయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన లక్ష్మి ప్రసన్న తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది… మంచు లక్ష్మి( Lakshmi Manchu ) యాంకర్ గా ,నటిగా, నిర్మాతగా ఉంటూనే సామాజిక అంశాలపై స్పందిస్తూ.తన వంతు సేవను అందిస్తూ ఉంటుంది.
ఇక సినిమాలు, డిజిటల్ మాధ్యమాలలోనే కాకుండా సోషల్ మీడియా( Social media )లో కూడా యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనను కూడా జీవితంలో కొంతమంది మోసం చేశారు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.
ఇంటర్వ్యూలో భాగంగా ఇన్నేళ్ల మీ ప్రయాణంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? అని అడగ్గా ఆ ప్రశ్నకు ఇలా సమాధానం తెలిపింది.మంచు లక్ష్మి మాట్లాడుతూ.నాకేముంది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu ) కూతురిని కదా.నన్నెవరు ఏం చేస్తారు అనే ఫీలింగు చాలా ఎక్కువగా ఉండేది.కానీ కొంతమంది నన్ను మోసం చేశారు.
వాళ్లు అలా చేస్తారని అప్పుడు అనుకోలేదు నన్ను జనాలు మోసం చేసినప్పుడు అంతే బాధగా అనిపిస్తుంది.మనతో ఎవరైనా ఒక మాట చెబితే దానికి ఒక విలువ అనేది ఉంటుంది.

ఎందుకంటే మాట్లాడే వ్యక్తి నుంచి వచ్చిన మాట కాబట్టి మోహన్ బాబు అమ్మాయి అయినప్పటికీ కూడా నన్ను మోసం చేశారు కానీ నేను బయటకు చెప్పుకోలేను.అలా చెబితే నేను వాళ్ళని ఫేమస్ చేసినట్లే అవుతుంది కదా.ముఖ్యంగా ఇంట్లో జరిగింది బయటపెట్టినట్లు అవుతుంది.అలాంటప్పుడు వాళ్ల గురించి నేను బయట చెప్పుకోవడం కూడా వ్యర్థమే.
శత్రువులకు మనం ఎప్పుడూ దూరంగానే ఉండాలి.నమ్మిన వాళ్లు మోసం చేస్తారు.ముఖ్యంగా వారి బుట్టలోనే మనం మరి తొందరగా పడిపోతాము అంటూ ఆమె వెల్లడించింది…

ఇకపోతే నన్ను మోసం చేసిన వాళ్ళు నాకు 30 సంవత్సరాలుగా తెలుసు.ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్లు నన్ను ఎందుకు మోసం చేస్తారు అనుకున్నాను.కానీ నేను యూఎస్ లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు.ఇక్కడ మాత్రం చెప్పేదొకటి.చేసేదొకటి ఇక్కడి మనుషులను అంచనా వేసేటప్పటికి.తూ నీ బతుకు అనిపించింది అని తెలిపింది మంచు లక్ష్మి…ఇక ప్రస్తుతం లక్ష్మి మంచి కథ దొరికితే మళ్ళీ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది…