యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) మరో బిగ్గెస్ట్ రికార్డ్ నెలకొల్పాడు.టాలీవుడ్ లో మరే హీరో బీట్ చేయలేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రభాస్ చేస్తున్న ‘సలార్’ మూవీ ఈ రోజు ఉదయం 5 గంటల 14 నిముషాలకు టీజర్ వచ్చిన విషయం తెలిసిందే.మరి ఈ టీజర్ కోసం ఎన్నో రోజులుగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మరి ఎట్టకేలకు ఈ టీజర్( Salaar Teaser ) ను ఈ రోజు రిలీజ్ చేయగా ఈ టీజర్ కు అద్భుతమైన స్పందన లభిస్తుంది.ఈ టీజర్ లో ప్రభాస్ విజువల్స్ లేకపోయినా ఈ టీజర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.
మాస్ విజువల్స్ అండ్ ఎలివేషన్ తో మరింత పవర్ఫుల్ గా ఉంది.నీల్ టీజర్ కట్ చూసిన తర్వాత ఈ సినిమా 1000 కోట్లు ఖాయం అంటున్నారు.
ఇది పక్కన పెడితే ఈ టీజర్ రిలీజ్ అయ్యి 7 గంటలు అవుతుంది.ఈ 7 గంటల్లోనే ఈ టీజర్ 25 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది.ఈ రికార్డును టాలీవుడ్ లో ఇంత వరకు ఎవ్వరు క్రియేట్ చేయలేక పోయారు.ముందు ముందు కూడా ఈ రికార్డ్ క్రాస్ చేయడం అరుదైన సంగతి అనే చెప్పాలి.
ఇక 24 గంటల్లో 60 నుండి 70 మిలియన్ వ్యూస్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సలార్ టీజర్ వ్యూస్ చూసిన తర్వాత డార్లింగ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పొచ్చు.ఇక ప్రభాస్ విజువల్స్ కూడా చూపించి ఉంటే 24 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసి ఉండేది అంటున్నారు.కాగా హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్( Hollywood ) రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 28న ఈ మూవీ గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.