ఎవ్వరూ బ్రేక్ చేయలేని రికార్డ్ క్రియేట్ చేసిన మోహన్ లాల్...

మోహన్ లాల్( Mohanlal ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎందుకంటే ఆయన పేరుకి మలయాళ స్టార్ అయిన కూడా తెలుగులో ఆయన సినిమాలు చాలానే డబ్ అయ్యాయి మంచి విజయం అందుకున్నాయి.

 Mohan Lal Created A Record That No One Can Break... , Mohan Lal , Kollywood , J-TeluguStop.com

ఇక అలాగే జూనియర్ ఎన్టీయార్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్( Janatha Garage ) సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు… ఇకపోతే ఏ హీరోకి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును ఆయన తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.అసలు విషయంలోకి వెళితే ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా విజయాలను అందించి భారతీయ హీరోలుగా పాపులర్ అయిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఒకే ఏడాదిలో ఏకంగా 25 హిట్ లు అందుకున్న హీరో గా ఇండస్ట్రీలో రికార్డు సృష్టించారు మోహన్ లాల్…

Telugu Bollywood, Jailer, Janatha Garage, Jr Ntr, Kollywood, Mohan Lal-Movie

ఇకపోతే సౌత్ తో సహా దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న మలయాళ సూపర్ స్టార్ నటుడు మోహన్ లాల్ ముఖ్యంగా దక్షిణాది భాషల్లోనే ఎక్కువగా నటించడమే కాదు గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్నారు.40 సంవత్సరాలకు పైగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈయన తన కెరియర్ లో 340 కంటే ఎక్కువ చిత్రాలను అందించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.ముఖ్యంగా వీటిలో చాలా సినిమాలు హిట్లుగానే నిలిచాయి.ఇకపోతే 1986 లోనే తిరుగులేని రికార్డు సృష్టించిన ఈయన 34 సినిమాలు అదే సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది…

 Mohan Lal Created A Record That No One Can Break... , Mohan Lal , Kollywood , J-TeluguStop.com
Telugu Bollywood, Jailer, Janatha Garage, Jr Ntr, Kollywood, Mohan Lal-Movie

వాటిలో 25 చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలిచి ఒకే సంవత్సరంలో అత్యధిక చిత్రాలలో నటించిన హీరో గానే కాకుండా అత్యధిక హిట్ చిత్రాలు అందుకున్న హీరోగా కూడా రికార్డు సృష్టించారు మోహన్ లాల్.1978లో తిరనోట్టం అనే సినిమాతో రంగప్రవేశం చేసిన ఈయన.రాంగోపాల్ వర్మ సినిమా కంపెనీతో బాలీవుడ్ కి కూడా అడుగు పెట్టారు అక్కడ అజయ్ దేవగన్, వివేక్ ఒబెరాయ్ వంటి హీరోలకు గట్టి పోటీ ఇచ్చి మళ్ళీ సౌత్ సినిమాలకే తిరిగి వచ్చేసారు…ఇక ప్రస్తుతం జైలర్ సినిమా( Jailer movie )లో నటిస్తున్నారు మోహన్ లాల్ ఇందులో హీరోగా రజనీకాంత్ నటిస్తున్నారు.ఈ సినిమా ఈ ఇయర్ ఆగస్ట్ 11 వ తేదీన రిలీజ్ కి రెఢీ గా ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube