ప్రధాని మోదీ( PM Narendra Modi ) నివాసంలో కీలక భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,( JP Nadda ) హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) హాజరయ్యారు.నిన్న కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగటంతో తాజాగా వీరి భేటీ జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకునే అవకాశముండటంతో ఎవరిని తొలగించాలి ఎవరిని తీసుకోవాలి అన్నదానిపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో కొత్తవారికి ఎవరికైనా అవకాశం కల్పించాలా అన్నదానిపై కూడా .చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే జులై 18న ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది.

ఆ ఎన్డీఏ పక్షాలతో( NDA ) తమ బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.దీంతో గతంలో ఎన్డీఏ మిత్రపక్షులుగా ఉన్న అకాలీదల్, చిరాగ్ పాశ్వాన్ కు ఆహ్వానం పంపడం జరిగిందట.ఇక కర్ణాటకలో జేడిఎస్ తో పొత్తుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.అంతే కాదు గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న.తెలుగుదేశం పార్టీకి( TDP ) అదేవిధంగా.ఎన్డీఏతో జతకట్టాలని చూస్తున్న పార్టీలకు.
కూడా బీజేపీ( BJP ) ఆహ్వానం పంపినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ రకంగా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే విధంగా బీజేపీ జులై 18న బలప్రదర్శనకు సిద్ధమైనట్లు సమాచారం.
ఈ క్రమంలో ప్రధాని మోడీ నివాసంలో అమిత్ షా, జేపీ నడ్డా బేటి కావడం జాతీయ రాజకీయాల్లో సైతం ప్రాధాన్యత సంతరించుకుంది.







