130 కేజీల నుండి 70 కేజీల బరువు తగ్గాడు.. ప్రపంచ రికార్డును దక్కించుకున్నాడు

మనం తినే ఆహార పదార్థాలు మరియు చేసే పనికి ఏమాత్రం మ్యాచ్‌ కాకుంటే లావు పెరగడం జరుగుతుంది.

అయితే అలా లావు పెరగడం ఒక మోస్తరు వరకే ఉంటుంది.

అయితే హార్మోనుల ప్రభావం వల్ల బరువు పెరిగితే మాత్రం అది మామూలుగా ఉండదు.వందల కేజీల బరువు పెరుగుతయి.

అలా బరువు పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.అలా పెరిగిన బరువును తగ్గించుకోవాలంటే మామూలు విషయం కాదు.

ఎంతో కష్టపడటంతో పాటు, కఠోన శ్రమ మరియు డైట్‌ అవసరం.చాలా కష్టపడి జోన్‌ విడ్లర్‌ అనే వ్యక్తి 130 కేజీలకు పైగా బరువు నుండి 70 కేజీల చిల్లర బరువుకు వచ్చాడు.

Advertisement

ఇంత బరువు తగ్గిన వ్యక్తిగా ప్రపంచంలోనే ఇతడు రికార్డును దక్కించుకున్నాడు.జోన్‌ విడ్లర్‌ ప్రస్తుతం 42 ఏళ్ల వయసులో ఉన్నాడు.

ఇతడు మొదటి నుండి కూడా అమితంగా తినడం వల్ల చాలా లావు అయ్యాడు.మొదట్లో పర్వాలేదులే అనుకున్నాడు.

కాని ఎప్పుడైతే 100 కేజీల బరువు క్రాస్‌ అయ్యాడో అప్పటి నుండి అతడిలో దిగులు మొదలైందట.ఎలాగైనా బరువు తగ్గాలని భావించేవాడట.

కాని అందుకు ఏమాత్రం ప్రయత్నాలు చేసేవాడు కాదు.ఇక 100 కేజీల నుండి తన బరువు ఇంకా ఇంకా పెరుగుతూనే వచ్చింది.130 కేజీలకు పైగా బరువు పెరగడంతో ఇంకా పెరిగితే చనిపోతాననే అభిప్రాయం అతడిలో వచ్చింది.అందుకే బరువు తగ్గాలనే నిర్ణయానికి వచ్చి కఠోర శ్రమ పడ్డాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

‹ డైట్‌ను పాటించకముందు జోన్‌ విడ్లర్‌ ప్రతి రోజు కూడా స్వీట్స్‌, చాక్లెట్స్‌, క్రిస్పిస్‌, శాండ్‌విచ్‌లు పెద్ద మొత్తంలో తినడంతో పాటు, సుగర్‌ ఇంకా ఖరీదైన తిండి తనేవాడు.ఎప్పుడైతే డైట్‌ పాటించడం మొదలు పెట్టాడో అంతకు ముందు తిన్న వాటిలో కనీసం 10 శాతం కూడా తినేవాడు కాదు.

Advertisement

మస్రూమ్స్‌, ఇంట్లో తయారు చేసిన సాస్‌, కొద్ది మొత్తంలో పండ్లు, అప్పుడప్పుడు బ్రెడ్‌ మాత్రం తీసుకునేవాడు.స్వీట్స్‌, శాండ్‌విచ్‌లు పూర్తిగా మానేశాడు.తిండి తగ్గించడంతో పాటు, ఒల్లును కాస్త కష్టపెట్టడం మొదలు పెట్టాడు.

దాంతో ప్రస్తుతం జోన్‌ బరువు 70 కేజీల వరకు వచ్చింది.ఇదే బరువు కొనసాగించేందుకు తాను తన డైట్‌ను కంటిన్యూ చేస్తాను అంటున్నాడు.

కృషితో ఏదైనా సాధ్యం అనేందుకు ఇది ఒక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు