England : ఇంగ్లాండ్‌లో విచిత్రమైన చోరీ ప్రయత్నం.. పోస్టాఫీసు నుంచి డబ్బు కొట్టేయడానికి చెంచా వాడాడుగా..!

తాజాగా ఇంగ్లాండ్‌( England )లో ఒక వింత చోరీ చోటు చేసుకుంది.

ఈ దేశంలోని నాటింగ్‌హామ్‌లో ఒక పోస్టాఫీసు నుంచి డబ్బును దొంగిలించడానికి ఒక వ్యక్తి పెద్ద చెంచాను ఉపయోగించాడు.

అతని పేరు జెలానీ స్కాట్.ఇటీవల ఇతను ఒక పొడవాటి మెటల్ స్పూన్‌తో హైసన్ గ్రీన్ పోస్టాఫీసు( Hyson Green Post Office )కు వెళ్లాడు.

అక్కడి నుంచి డబ్బులు కొట్టేద్దామని ప్లాన్ చేశాడు.శనివారం ఫిబ్రవరి 10, ఉదయం 11:45 గంటలకు ఈ చోరీ చేయడానికి ప్రయత్నించాడు కానీ అక్కడ పనిచేసే వ్యక్తి జెలానీ దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నాడని తెలుసుకున్నాడు.దానిని భగ్నం చేసే ఉద్దేశంతో వెంటనే ఒక బటన్‌ను నొక్కారు.

పొగలు వచ్చి గదిని నింపాయి.స్కాట్‌కు బాగా కనిపించలేదు, అందుకే అతను వెళ్లిపోయాడు.

Advertisement

అతని చేతికి డబ్బులు రాలేదు.

అయితే జెలానీ అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఒక పెద్ద తప్పు చేసాడు.పోస్టాఫీసులో డెబిట్ కార్డు( Debit Card ) మర్చిపోయాడు.దానిని పోలీసులు గుర్తించారు.

సెక్యూరిటీ కెమెరాల్లో కూడా అతడిని చూశారు.తొమ్మిది రోజులుగా అతని కోసం వెతికారు.

చివరికి వారు అతన్ని ఫారెస్ట్ రోడ్ వెస్ట్, రాడ్‌ఫోర్డ్‌లో కనుగొన్నారు.ఇలాంటి పని ఎందుకు చేసావు అని ప్రశ్నించగా తన మనసులో సమస్యలు ఉన్నాయని స్కాట్ చెప్పాడు.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!

పోస్టాఫీసుకు వెళ్లే ముందు డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా చెప్పాడు.ఫిబ్రవరి 21న అతడిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.

Advertisement

ఆ సమయంలో అతడు తాను ఆ తప్పు చేశానని క్షమించమని కోరాడు.

పోలీసులు అతన్ని జైలుకు పంపలేదు.ఆరు నెలల పాటు డ్రగ్ రిహాబ్ ప్రోగ్రామ్( Drug Rehab Program ) కు హాజరు కావాలని ప్రవేశించారు.ఇది అతనికి డ్రగ్స్ తీసుకోవడం ఆపడానికి సహాయపడుతుంది.

కొంత డబ్బు చెల్లించమని కూడా చెప్పారు.అతను కోర్టుకు, పోస్టాఫీసులో పనిచేసిన వ్యక్తికి మనీ చెల్లించవలసి వచ్చింది.

ఫిబ్రవరి 27, మంగళవారం, నాటింగ్‌హామ్‌షైర్ పోలీసులు స్కాట్ చోరీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌( Instagram )లో షేర్ చేశారు.దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

తనను పోలీసులు పట్టుకోవడం సంతోషంగా ఉందని ఓ వ్యక్తి చెప్పాడు.మరో వ్యక్తి జైలుకు ఎందుకు పంపించలేదని అడిగాడు.

దేశం అధ్వాన్నంగా ఉందని, చెడు పనులు చేస్తే జైలుకు వెళ్లాల్సిందేనని మరో నెటిజెన్ అన్నారు.తమ తప్పుల నుంచి ప్రజలు నేర్చుకోవాలంటే తగిన శిక్ష విధించాలని కోరారు.

తాజా వార్తలు