జీవితాంతం బ‌ర్గ‌ర్లు తింటూ.. చివ‌రికి ఈ ఘ‌న‌త సాధించాడు!

ప్రపంచంలో వివిధ రకాల వ‌రల్డ్‌ రికార్డులు న‌మోద‌వుతుంటాయి.గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో తమ పేరు నమోదు చేసుకునేందుకు ఏళ్ల తరబడి కష్టపడుతున్న కొంతమందిని మ‌నం చూసేవుంటాం.

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ అయిన మెక్‌డొనాల్డ్స్ బర్గర్లు ఎవ‌రికి ఇష్టం ఉండ‌వు చెప్పండి.డాన్ గోర్స్కే వాటిని ఎంతగానో ఇష్టపడ్డాడు.

అతను వాటిని తింటూ రికార్డు సృష్టించాడు.అతని జీవితంలో అంటే గ‌డ‌చిన 50 సంవత్సరాలుగా, అతను దాదాపు ప్రతిరోజూ మెక్‌డొనాల్డ్స్ బిగ్ మాక్‌ను తింటూ చివ‌రికి ప్రపంచ రికార్డులలో తన పేరును నమోదు చేసుకున్నాడు.

ఈ వింత రికార్డులు సృష్టించిన డాన్ గోర్స్కే తన జీవితంలోని 50 ఏళ్లలో మొత్తం 32,340 బిగ్ మ్యాక్‌లను తిన్నాడు.ఆగస్టు 2021 వరకు కౌంటింగ్ ఆధారంగా అతని రికార్డు నమోదైంది.కాగా 20 ఏళ్ల క్రితమే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో ఈయ‌న తన పేరు నమోదు చేసుకున్నాడు.1999 సంవత్సరంలోనే అతను 5,490 బిగ్ మాక్‌లను తినడం ద్వారా తన జీవితంలో అత్యధిక బిగ్ మ్యాక్ తిన్న వ్య‌క్తిగా గుర్తింపు పొందాడు.ఇప్పుడు అతను తాజాగా తన 50 సంవత్సరాల ప్రత్యేక బ‌ర్గ‌ర్ ఉత్స‌వాన్ని జరుపుకున్నాడు.32,340 బిగ్ మ్యాక్‌లను తిన్న కొత్త రికార్డు సృష్టించాడు.అతను తన జీవితంలో మొదటి బర్గర్‌ను మే 17, 1972న తిన్నాడు.

Advertisement

అప్పటి నుండి ఈ ప్రక్రియ ఇప్ప‌టి వరకు కొనసాగుతోంది.తాను రోజుకు రెండు పూట‌లా బర్గర్లు తింటాన‌ని గోర్స్కే చెప్పాడు.

తాను గ‌త‌ 50 ఏళ్లలో కేవలం 8 రోజులు మాత్ర‌మే బ‌ర్గ‌ర్ తిన‌లేద‌ని తెలిపాడు.అతను విస్కాన్సిన్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాడు, అక్కడే అతను తన మొదటి బర్గర్‌ను తిన్నాడు.దేనిమీద‌నైనా ఇష్టం క‌లిగిన‌ప్పుడు త్వరగా వదిలేయలేన‌ని అత‌ను అన్నాడు.

అందుకే తాను బ‌ర్గ‌ర్ త‌ప్ప‌ మరేదీ తిన‌లేద‌న్నాడు.ఇది మాత్రమే కాదు గోర్స్కే బర్గర్‌లకు పెద్ద అభిమాని.

అతను దీనికి సంబంధించిన ప‌లు రాపర్‌లను కూడా సేకరించాడు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు