మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యేప్పన్ కోషియమ్ సినిమాని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సాగర్ చంద్ర దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అదే విధంగా క్యారెక్టర్ ని సాగర్ చంద్ర డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో సెకండ్ హీరో పాత్ర కోసం రానా, గోపీచంద్ లో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.రానాతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు.
అయితే ఏ కారణంగానో అతని వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.దీంతో గోపీచంద్ ని కూడా సంప్రదిస్తున్నారు.
వీరిలో ఎవరో ఒకరు ఖరారయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్ గా మళయాయి బ్యూటీ యమదొంగ సినిమాలో ఎన్ఠీఆర్ కి జోడీగా కనిపించిన మమతా మోహన్ దాస్ ని హీరోయిన్ గా ఖరారు చేశారని తెలుస్తుంది.
తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసిన మమతా మోహన్ దాస్ తరువాత మాతృభాషకి పరిమితం అయిపోయింది.అదే సమయంలో ఆమె క్యాన్సర్ బారిన కూడా పడింది.క్యాన్సర్ ని జయించి మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది.రీ ఎంట్రీ తర్వాత మలయాళంలో వరుస సినిమాలు చేస్తుంది.
చాలా కాలం తర్వాత ఈ రీమేక్ తో టాలీవుడ్ ఆమె తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుందని టాక్ వినిపిస్తుంది.త్వరలో చిత్ర యూనిట్ అధికారికంగా ఆమె పేరు ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది.