రస్క్ బిస్కెట్స్‌ తింటున్నారా.. ఈ వీడియో చూస్తే జన్మలో మళ్లీ వాటిని తినరు..?

రస్క్ అనేది చాలా మంది భారతీయులు టీలో ముంచుకుని తినే ఒక క్రిస్పీ బిస్కెట్.

ఇది డబుల్ బేకింగ్ వల్ల అద్భుతమైన టేస్ట్, టెక్చర్‌ ఆఫర్ చేస్తుంది.

వీటిని ఎన్ని తిన్నా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.అయితే రస్క్ బిస్కెట్స్‌( Rusk Biscuits ) ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూశారా? చూస్తే మళ్లీ వాటిని తినే రిస్క్ చేయరు.ఎందుకంటే వాటిని చాలా అపరిశుభ్ర వాతావరణంలో ప్రిపేర్ చేస్తారు.

ఇది మేమంటున్న మాట కాదు.సోషల్ మీడియా యూజర్లు అంటున్న మాటలు.

ప్రస్తుతం రస్క్ ఫ్యాక్టరీ( Rusk Factory ) అపరిశుభ్రతను తెలిపే వీడియో ఇంటర్నెట్‌ యూజర్లను దిగ్భ్రాంతికి గురి చేసింది.

Advertisement

ఈ వీడియోను మొదట అమర్ సిరోహి పోస్ట్ చేసారు.తర్వాత @Ananth_IRAS ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసారు.ఈ వీడియోలో బిస్కెట్స్‌ తయారు చేసే వర్కర్స్ హ్యాండ్ గ్లోవ్స్‌( Hand Gloves ) లేదా ముసుగులు లేకుండా ఎలా రస్క్ బిస్కెట్స్‌ చేస్తున్నారో కనిపించింది.

వారిలో ఒకరు పిండిని కలుపుతున్నప్పుడు కూడా స్మోకింగ్ కూడా చేస్తున్నాడు.పనివాళ్లు చేతితో పిండిని పిసికి, పొడవాటి రొట్టెలుగా చేసి, కాల్చి, ముక్కలు చేసి, మళ్లీ కాల్చడం ఈ వీడియోలో మనం చూడవచ్చు.

ఎక్స్ పోస్ట్‌లో, "ఇది నిజమైతే, నేను మళ్ళీ టోస్ట్ తినడానికి ధైర్యం చేయను!" అని క్యాప్షన్ ఈ వీడియోకు జోడించారు.

ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతోంది.చాలా మంది నెటిజన్లు దీన్ని చూసి మండిపడుతున్నారు.ఫ్యాక్టరీలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంపై వారు అసహ్యం, ఆగ్రహం వ్యక్తం చేశారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఈ వీడియో చూసిన కొందరు బయటి ఆహారం తినడం మానేయాలని నిర్ణయించుకున్నారు.మరికొందరు ఆ వేడికి క్రిములు చనిపోతాయని చెప్పి పరిస్థితిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

Advertisement

దీనిని మీరూ చూడండి.

తాజా వార్తలు