పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలా.. ఈ టిప్స్ పాటించండి

వివాహం అనేది అందరి జీవితాల్లో గుర్తుండిపోయే ఘట్టం.వివాహాన్ని అంతా గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటారు.

అయితే దానికి చాలా ప్లానింగ్ అవసరం.ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే మీ వివాహ వేడుకను జీవితాంతం మరుపురాని మధురానుభూతిగా మార్చుకోవచ్చు.

వివాహ వేదికను ఎంచుకోవడం, హనీమూన్ కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం, అలంకరణ వస్తువులు-వివాహ దుస్తులు కొనుగోలు, అతిథులకు స్వాగతం పలకడం, వివాహ భోజనంలో మెనూ వంటి వాటిపై దృష్టి సారించాలి.వీటి గురించి పరిశీలిద్దాం.

నేటి కాలంలో, వివాహం అతిపెద్ద ఖర్చులలో ఒకటిగా పరిగణించబడుతుంది.కాబట్టి మొదట వివాహానికి ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో బడ్జెట్ వేసుకోవాలి.

Advertisement

దాని తగ్గట్టు మీకు అనువైన వివాహ వేదికను ఎంచుకోవాలి.అది పెళ్లికి వచ్చే అతిథులు మెచ్చేలా, అందరికీ అనుకూలంగా ఉండాలి.

వివాహం తర్వాత ఎక్కడికి హనీమూన్ కోసం వెళ్లాలనుకుంటున్నారో కూడా ప్లాన్ చేసుకోవాలి.విదేశాల్లోనా, లేక దేశంలోని ఏదైనా మంచి పర్యాటక ప్రాంతమా అనేది ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి.

ఎన్ని రోజులు ఉండాలో, ఏయే హోటళ్లలో బస చేయాలో ముందుగానే అంచనా ఉంటే మంచిది.ఇక వివాహ వేడుకలో వేసుకునే దుస్తులు, అలంకరణ వస్తువుల కోసం కూడా బడ్జెట్ ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి.

అందుకు తగిన విధంగా షాపింగ్ చేసుకోవాలి.నగలు, దుస్తులకు చాలా ఖర్చు అవుతుంది.వీటి విషయంలో జాగ్రత్త అవసరం.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
ఇదేం ఆనందాంరా బాబు.. విడాకులు వచ్చాయని ఏకంగా?

మీరు ఏ ఆచారం ప్రకారం వివాహం చేసుకుంటున్నారో, దానికి తగ్గట్టు పెళ్లి ఖర్చు ఉంటుంది.ఉదాహరణకు, వివాహం రెండు రోజుల ఫంక్షన్ లేదా ఐదు రోజులు ఉంటే దానికి తగ్గట్టు ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది.

Advertisement

అతిథులకు స్వాగతం పలికే విషయంలో ముందు జాగ్రత్త అవసరం.

వచ్చిన అతిథులను పట్టించుకోకుంటే వారి నుంచి విమర్శలు వస్తాయి.వారికి బస ఏర్పాటు, భోజనం ఇతర సౌకర్యాలు తగిన విధంగా ఉన్నాయో లేదో గమనించుకోవాలి.వివాహ విందులో కొన్ని ప్రత్యేక వంటకాలు వేడుకకు మరింత పేరును తీసుకొస్తాయి.

రుచికరమైన వంటలు, స్వీట్లు వంటివి అందరూ మెచ్చేలా ఉండాలి.వివాహ కార్యక్రమంలో అతిథులకు అందించే డ్రింకులను కూడా ఆరెంజ్, డ్రాగన్ ఫ్రూట్ వంటి వాటితో చేసే జ్యూస్‌లు ఆరోగ్యానికి కూడా బాగుంటాయి.

ఇలా అన్ని విషయాల్లో ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే మీ వివాహ వేడుక అందరూ మెచ్చేలా, మీకు కూడా కలకాలం గుర్తుండిపోయేలా జరుగుతుంది.

తాజా వార్తలు