అగ్ర దర్శ కుడు శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ నటి స్తున్న చిత్రం షూటింగ్ ఈ నెల 13, 14 తేదీల్లో సింహగిరిపై జరగనుంది.సినిమా షూటింగ్ సందర్భంగా సింహగిరి మాడవీధుల్లో హడావుడి నెలకొంది.
రాజగోపురం మార్గంలో దారిలో దుకాణాల సెట్ తో పాటు రహదారి మొత్తం రంగులతో ముగ్గులు వేశారు.సింహగిరి ప్రాంతం అందంగా అలకరించారు పడమర సింహగిరి మాడవీధుల్లో వేసిన దుకాణాల సెట్టు, రంగవల్లికలు చూడడానికి అభిమానులు కొండకు చేరుకుంటున్నారు.
పడమర మాడవీ దిలో దుకాణాల సెట్ వేయడంతో భక్తుల ద్విచక్ర వాహనాల పార్కింగ్కు సమస్య లేకుండా చూడాలని పలువురు భక్తులు కోరుతున్నారు.