జక్కన్న సినిమాలో మహేష్ బాబు ఫైనల్ లుక్ ఇదేనా.. మహేష్ రాజకుమారుడిలా ఉన్నాడుగా!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు ( SS Rajamouli, Mahesh Babu )కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.

సినిమా షూటింగ్ కూడా ఇంకా మొదలుకాకముందే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.రాజమౌళి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

కాగా ఆర్ఆర్ఆర్( RRR ) తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త మరింత పెరిగాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే.తాజాగా కూడా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే.

Advertisement

ఇప్పటివరకు జక్కన్న తన సినిమాల్లో ప్రతి ఒక్క హీరోని బెస్ట్ లుక్ లో ప్రజెంట్ చేస్తూ వచ్చారు.అలా ఈసారి మహేష్ బాబును కూడా బెస్ట్ లుక్ లో చూపించడానికి రెడీ అయిపోయారు జక్కన్న.

దీంతో మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుందా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది.అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.

మహేష్ బాబు తాజాగా అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యాడు.భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి పెళ్లి వేడుకకు హాజరైన మహేష్, మీడియాకు పోజులిచ్చాడు.

అందులో లాంగ్ హెయిర్, గడ్డం, మీసాలతో కనిపిస్తున్నాడు.ఇప్పటివరకు మహేష్ ఎప్పుడూ కనిపించని మేకోవర్ ఇది.బహుశా, రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ ఇదే కావచ్చని టాక్.సినిమా షూటింగ్ కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి, ఈ లుక్ లో మరికొన్ని మార్పు చేర్పులు కూడా ఉండవచ్చు.

చిగుళ్ల నుంచి తరచూ రక్తం వస్తుందా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
డంప్‌స్టర్ డైవింగ్ ద్వారా రూ.63 లక్షలు సంపాదించిన యూఎస్ మహిళ..?

రాజమౌళి సినిమాలో మహేష్ లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్నాడనేది మాత్రం పక్కా.ఈ లుక్ చూసి థార్ సినిమాలో హీరోలా మహేష్ ఉన్నాడంటూ పొంగిపోతున్నారు అతడి ఫ్యాన్స్.

Advertisement

అంతేకాకుండా ఈ లేటెస్ట్ లుక్ లో మహేష్ బాబు మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు.కేవలం లుక్ పరంగానే కాకుండా, ఫిట్ నెస్ పరంగా కూడా మహేష్ ఈసారి భిన్నంగా కనిపించబోతున్నాడు.

తాజా వార్తలు