మహేష్ బాబు వేసుకున్న ఈ స్వెట్టర్ ఖరీదు ఎంతో తెలుసా... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటుడు మహేష్ బాబు(Mahesh Babu) ఒకరు.

నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన హీరోగా వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నారు.

అలాగే వ్యాపారవేత్తగానూ సత్తా చాటుతున్నాడు.ఇకపోతే తాజాగా మహేష్ బాబు హలో( Hello ) మ్యాగజైన్ కోసం షోటో షూట్ చేశాడు.

డిఫ్రడెంట్ డ్రెస్సుల్లో సూపర్ స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హలో మ్యాగేజైన్ కోసం చేసిన ఫోటో షూట్ లో లూయిస్ విట్టన్ బ్రాండ్ కు చెందిన మల్టీ కలర్ డిస్టర్టెడ్ జెయింట్ డామియర్ స్వెటర్‌ ధరించి హ్యాండ్సమ్ గా కనిపించారు.ఇలా మల్టీ కలర్ స్వెటర్లో( Swetter ) మహేష్ బాబు కనిపించడంతో ప్రతి ఒక్కరూ మహేష్ బాబు ధరించిన ఈ స్వెటర్ ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు.అయితే ఈ స్వెటర్ ఖరీదు తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.మహేష్ బాబు ధరించిన ఈ స్వెటర్ ఖరీదు అక్షరాల రూ.1,04,041.అంటే లక్ష రూపాయిలకు పైమాటే.

Advertisement

ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.మహేష్ స్వెటర్ కాస్ట్ తో ఒక మంచి ఐఫోన్ కొనేయెచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే సినీ సెలబ్రిటీలకు ఇలా ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు ధరించడం సర్వసాధారణం అయినప్పటికీ సామాన్య ప్రజలకు మాత్రం ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమని చెప్పాలి.ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన గుంటూరు కారం( Gunturu kaaram ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.ఈ సినిమా తర్వాత రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో మహేష్ బాబు తన తదుపరి సినిమాతో బిజీ కానున్నారు.

ఈ సినిమా అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది..

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు