ఆ ఒక్క విషయంలో తేజ సజ్జాను రిక్వెస్ట్ చేసిన మహేష్ బాబు.. అలా మాత్రం పిలవొద్దంటూ?

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలయ్యే సినిమాలలో ఏదో ఒక సినిమాకు అన్యాయం జరుగుతుందని కామెంట్లు వినిపించడం సర్వ సాధారణం అనే సంగతి తెలిసిందే.

ఈసారి సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న హనుమాన్ సినిమాకు( HanuMan Movie ) అన్యాయం జరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గుంటూరు కారం,( Guntur Karam Movie ) హనుమాన్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హనుమాన్ సినిమాకు నష్టం చేకురూతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే 11వ తేదీ సాయంత్రం నుంచి హనుమాన్ సినిమా ప్రీమియర్లు ప్రదర్శితం అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఈ సినిమాలో హనుమంతుడి రోల్ లో కనిపిస్తారని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇందుకు సంబంధించిన క్లారిటీ రానుందని తెలుస్తోంది.

తేజ సజ్జా( Teja Sajja ) హనుమాన్ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Advertisement

రాజకుమారుడు, యువరాజు సినిమాలలో మహేశ్ తో ( Mahesh Babu ) కలిసి నటించిన తేజ సజ్జా ఇప్పుడు మహేష్ సినిమాతో పాటుగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నారు.అయితే రాజకుమారుడు సినిమా( Rajakumarudu Movie ) షూటింగ్ సమయంలో మహేష్ బాబు ఒక విషయంలో రిక్వెస్ట్ చేశారని తేజ సజ్జా పేర్కొన్నారు.రాజకుమారుడు షూట్ సమయంలో మహేష్ ను మగేష్ అన్నా మగేష్ అన్నా అని పిలిచేవాడినని తేజ సజ్జా అన్నారు.

ఆ సమయంలో మహేష్ బాబు నన్ను పిలిచి నా పేరు పలకడం రాకపోతే అన్నా అని పిలువు.అంతే తప్ప నా పేరును ఖూనీ చేయకు అని చెప్పారని తేజ సజ్జా చెప్పుకొచ్చారు.చైల్డ్ ఆర్టిస్ట్ తో యాక్ట్ చేయడం చాలా కష్టమని తేజ సజ్జా అన్నారు.

ఈ నెల 7వ తేదీన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు