మహేష్ బాబు "గుంటూరు కారం" ట్రైలర్ విడుదల..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు "గుంటూరు కారం( Guntur Kaaram )" ట్రైలర్ రిలీజ్ అయింది.

విడుదలైన పోస్టర్స్ లో ఉన్నట్టుగానే ట్రైలర్ కూడా మాస్ రేంజ్ లో ఉంది.

మహేష్ బాబుని డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా పవర్ ఫుల్ గా చూపించారు.కొడుకు తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో సినిమా చిత్రీకరణ జరిగినట్లు ట్రైలర్ బట్టి తెలుస్తుంది.

చాలా ఉరా మాస్ పాత్రలో.మహేష్ బాబుని చూపించారు.

ప్రకాష్ రాజ్( Prakash Raj ) విలన్ పాత్రలో.మహేష్ తల్లిగా రమ్యకృష్ణ నటించినట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది.

Advertisement

రావు రమేష్ కూడా కీలక పాత్ర పోషించారు.

శ్రీలీల, మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) లను కూడా ట్రైలర్ లో అద్భుతంగా చూపించడం జరిగింది.థమన్ మ్యూజిక్ కూడా బాగుంది.జనవరి 12వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఈ క్రమంలో జనవరి 6వ తారీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో రద్దయింది. హైదరాబాద్ పోలీసులు అనుమతులు ఇవ్వలేదు.దీంతో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మరో తేదీని ప్రకటించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ఆల్రెడీ గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ అతడు, ఖలేజా సినిమాలు చేయడం జరిగింది.ఈ రెండు సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?

వీరి కాంబినేషన్ లో దాదాపు 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు