స్పైడర్‌, బ్రహ్మోత్సవం చిత్రాలు ఫ్లాప్‌ ఎందుకు అయ్యాయంటే.. మహేష్‌ మాట

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా కొన్నాళ్ల క్రితం వచ్చిన బ్రహ్మోత్సవం మరియు స్పైడర్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డ విషయం తెల్సిందే.

ఆ చిత్రాలు భారీ అంచనాల నడుమ రూపొందాయి.

మహేష్‌ బాబు కెరీర్‌లో నిలిచి పోయేలా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను దక్కించుకుని, రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకుంటాయని అంతా ఆశించారు.కాని ఊహించని విధంగా అనూహ్య షాక్‌ ఇచ్చాయి.

మహేష్‌బాబు కెరీర్‌ లో ఆ రెండు నిలిచి పోయే సినిమాలే కాని బ్లాక్‌ బస్టర్‌ కాదు, డిజాస్టర్‌ అయ్యి నిలిచి పోయాయి.ఇప్పటి వరకు మహేష్‌ బాబు ఆ రెండు సినిమాల ప్రభావం నుండి కోలుకోలేక పోయాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

ఆ రెండు సినిమా ఫలితాల తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయాలన్నా కూడా మహేష్‌ బాబు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాడట.తాజాగా మహర్షి చిత్రంను పూర్తి చేసిన మహేష్‌ బాబు ఆ చిత్రాలను ఈనెల 9వ తారీకున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

Advertisement

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా మహేష్‌ బాబు మాట్లాడుతూ ఆ రెండు చిత్రాలపై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు.

మహేష్‌ బాబు మాట్లాడుతూ గతంలో తాను కథను కేవలం 20 నిమిషాల్లో వినేవాడిని, ఆ సమయంలో దర్శకులు చెప్పే కథ చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించేంది.దాంతో వెంటనే సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యేవాడిని, అలా చేసినవే స్పైడర్‌ మరియు బ్రహ్మోత్సవం.ఆ రెండు సినిమాల కథలు మొదట విన్న సమయంలో వావ్‌ అనిపించాయి.

కాని సినిమా పూర్తి అయిన తర్వాత నిరాశ పర్చాయి.అందుకే సినిమా ఎంపిక చేసే సమయంలో బౌండెడ్‌ స్క్రిప్ట్‌ నచ్చితేనే ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నాను.

భవిష్యత్తులో కూడా 20 నిమిషాలు కథ విని సినిమాలకు ఓకే చెప్పను అంటూ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు