మహేష్‌తో 70 కోట్ల ఒప్పందం

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు.ఒక్క సినిమా చేస్తే చాలు అనుకునే వారు కూడా ఉన్నారు.

మహేష్‌తో సినిమా చేస్తే ప్రాఫిట్‌ గ్యారెంటీ అనుకునే వారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.అందుకే మహేష్‌బాబు ఎంత పారితోషికం పెంచినా కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు పెద్ద నిర్మాతలు పోటీ పడుతూనే ఉంటారు.

తాజాగా మహేష్‌బాబుతో ఏకంగా మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు ప్రముఖ నిర్మాత ప్రసాద్‌ వి పొట్లూరి.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్‌బాబు ఆ వెంటనే శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశముంది.

ఆ సినిమాను పీవీపీ నిర్మాణ సంస్థలో తెరకెక్కబోతున్నట్లుగా ఇప్పటికే తెలిసిన విషయమే.ఆ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా పీవీపీ సంస్థలో మహేష్‌బాబు చేయనున్నట్లుగా తాజాగా ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

ఈ మూడు సినిమాల్లో నటించనున్నందుకు మహేష్‌బాబు ఏకంగా 70 కోట్ల పారితోషికాన్ని తీసుకోబోతున్నాడు.సినిమా సక్సెస్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఈ పారితోషికంను ఇచ్చేందుకు నిర్మాత ప్రసాద్‌ సిద్దం అవుతున్నాడు.

ఇప్పటి వరకు ఇంత భారీ మొత్తంలో ఒప్పందం కుదరలేదు.ఇదే మొదటి సారి.

దీంతో మహేష్‌ మరోసారి సూపర్‌స్టార్‌ అనిపించుకున్నాడు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు