మాచో లుక్‌ లో హల్చల్ చేస్తున్న మిస్టర్ కూల్..!

క్రీకెట్ ప్రపంచంలో మిస్టర్ కూల్ గా పేరు ఉన్న ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం నుంచి తన కుటుంబ సబ్యులతో ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి అందరికీ విధితమే.

అయితే తాజాగా ధోనీ తన కుటుంబ సభ్యులతో కలిసి సిమ్లా పర్యటనకు వెళ్లారు.ఈ పర్యటనలో మహేంద్ర సింగ్ ధోనీ, సతీమణి సాక్షి సింగ్ తోపాటు కూతురు జీవ అలాగే 12 మంది కుటుంబ సభ్యులతో వెళ్ళినట్లు తెలుస్తుంది.

అయితే పర్యటనలో భాగంగా సిమ్లాలో ఒక విలాసవంతమైన కాటేజీలో ఉంటున్న ధోని కుటుంబం అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ప్రస్తుతం ధోని మాచో లుక్‌ లో ఉన్న ఫోటోలు వైరల్ గా చెక్కర్లు కొడుతున్నాయి.

వాస్తవానికి సిమ్లా ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తుంది.కనుక అక్కడ ఎక్కువ శాతం ఇళ్లు చెక్కలతోనే నిర్మిస్తు ఉంటారు.

Advertisement

అయితే అక్కడి వాతావారణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా కనిపించిన ధోని ఫోటోలను షేర్‌ చేస్తూనే చెట్లు నాటండి.అడవులు కాపాడండి అనే కామెంట్ ను జత చేశారు.

ఇది ఇలా ఉండగా ధోని అభిమానులను రెండుగా చీల్చింది.ఒక వర్గం ధోనిని పొగిడితే.

మరో వర్గం మాత్రం ధోని చర్యపై ఆగ్రహంగా ఉన్నారు. ఒకవైపు చెట్లను నరికి ఇల్లు కడుతున్న ధోనీ.

వేరే వాళ్లకు మాత్రం చెట్లు నాటమని సలహా ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇక ఐపీఎల్‌ 2021 సీజన్‌ లో సీఎస్‌కే జట్టును ఎంఎస్‌ ధోని విజయవంతంగా ముందుకు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌ ను మరిపిస్తూ సీఎస్‌కే జట్టు ఈ సీజన్‌ లో అద్భుత ప్రదర్శన ఇచ్చింది.ఇక ఇప్పటి వరుకు ఆడిన 7 మ్యాచ్‌ లలో 5 విజయాలు.

Advertisement

రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది సీఎస్‌కే టీమ్.ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి మొదలు అవ్వబోతుంది.

ప్రస్తుతం మాత్రం కుటుంబంతో హాయిగా, సరదాగా గడుపుతున్న ధోని ఆగస్టులో సీఎస్‌కే టీంను కలవనున్నడు.

తాజా వార్తలు