వేలానికి మహాత్మాగాంధీ కళ్ళజోడు.. ధర ఎంతంటే?

మామూలుగా పురాతనమైన వస్తువులను కొన్ని కొన్ని సార్లు వేలం వేస్తూ ఉంటారు.ఇలాంటి పురాతనమైన వస్తువులను కొనుక్కునేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.

కొంతమంది పురాతనమైన వస్తువులను తమ వద్ద ఉంచుకోవడం ఎంతో గౌరవంగా ఫీల్ అవుతూ ఉంటారు, అయితే ఇటీవల భారత జాతిపిత మహాత్మా గాంధీ కి సంబంధించిన బంగారు పూతతో కూడిన కళ్ళజోడు.ఇంగ్లండ్ లో వేలానికి పెట్టారు.

హాన్హామ్ లోని ఈస్ట్ బ్రిస్టల్ అనే సంస్థలో మహాత్మా గాంధీ కి సంబంధించిన కళ్ళజోడును వేలం పెట్టినట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. 1910 నుంచి 1930 మధ్యలో దక్షిణాఫ్రికాలోని పెట్రోలియం లో పనిచేస్తున్న తన అంకుల్ తన తండ్రికి ఈ కళ్ళజోడును బహుమతిగా ఇచ్చినట్లుగా.

కళ్ళజోడు ను వేలానికి పెట్టిన వ్యక్తి చెప్పుకొచ్చాడు, 1910 నుంచి 1920 మధ్యకాలంలో మహాత్మా గాంధీ సైతం దక్షిణాఫ్రికాలో ఉన్నారు అన్న ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈ కళ్ళజోడు మహాత్మా గాంధీధి అని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.అయితే పురాతనమైన కళ్లద్దాలను దక్కించుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ కళ్లజోడు దక్కించుకోవడానికి ఏకంగా 6వేల పౌండ్ల వరకు వెచ్చించి కొంత మంది దరఖాస్తు చేసుకున్నారట, అయితే ప్రస్తుతం ఈ బంగారు పూతతో కూడిన కళ్ళజోడు 10 వేల నుంచి 15 వేల పౌండ్ల వరకు అమ్ముడు పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు, 21న ఈ కళ్ళజోడును ఎవరు దక్కించుకో పోతున్నారు అన్నది తేలనుంది.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు