సూపర్ స్టార్ ఫాన్స్ ని మెస్మరైజ్ చేసిన మహర్షి టీజర్  

మహర్షి టీజర్ రిలీజ్ .

Maharshi Teaser Release-release,tollywood

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం మహర్షి. ఈ సినిమాలో పూజా హెగ్డే మహేష్ కి జోడీగా నటిస్తూ ఉండగా, ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటె ఉగాది సందర్భంగా తాజాగా మహర్షి టీజర్ ని నిర్మాతలు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు..

సూపర్ స్టార్ ఫాన్స్ ని మెస్మరైజ్ చేసిన మహర్షి టీజర్-Maharshi Teaser Release

ఇక ఈ టీజర్ లో ఫ్లైట్ తో ఎంట్రీ ఇచ్చిన మహేష్ అదిరిపోయే లుక్స్ తో జేమ్స్ బాండ్ తరహాలో గ్రాండియర్ లో కనిపించాడు.కోటీశ్వరుడుగా రిషి ఎంట్రన్స్ చూపించిన వంశీ, తరువాత అతనిని సామాన్యుడుగా, స్టూడెంట్ గా రిప్రజెంట్ చేసి క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూపించాడు. రెండు వేరియేషన్స్ లో కనిపిస్తున్న మహేశ్ లుక్స్ బట్టి ఇది కోట్ల ఆస్తిని వదులుకొని ప్రజల మధ్యకి, స్నేహితుడు ఆశయం బ్రతికించడం కోసం వచ్చిన రిషి అనే యువకుడు కథ ని స్పష్టంగా తెలుస్తుంది.

మరి టీజర్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన మహేష్ ఈ సినిమాతో ఎ మేరకు ప్రేక్షకులని మెప్పిస్తాడు అనేది చూడాలి.