మూడు పొరల మాస్క్ మూడు రూపాయలకే.. ఎక్కడంటే?

కరోనా వైరస్ ప్రజలను ఎలా పీక్కతింటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రజలను దారుణంగా వణికించింది.

ఈ కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం సైతం వణికిపోయింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పటికే నాలుగు కోట్లమంది ప్రజలకు కరోనా వైరస్ వ్యాపించిన సంగతి తెలిసిందే.

ఇక అలా వ్యాపించిన కరోనా వైరస్ కు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 11 లక్షలమంది బలయ్యారు.ఇక ఇప్పటికే మూడు కోట్లమందికిపైగా కరోనా వైరస్ నుంచి కోలుకోగా కోటిమందికిపైగా కరోనా వైరస్ తో పోరాడుతున్నారు.

ఇక భారత్ లో వాతావరణం కారణంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఏం చెయ్యాలో తోచని సమయంలో ప్రభుత్వం కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు మాస్కులు, శానిటైజర్ ఉపయోగించాలని, బౌతికంగా దూరంగా ఉండాలని ప్రభుత్వాలు సూచించాయి.అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది.

Advertisement

కరోనా వైరస్ సమయంలోను మాస్కుల ధర ఎక్కువ ఉండటం వల్ల ఎంతోమంది కొనడం లేదని, ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.రెండు, మూడు పొరలు ఉన్న మాస్కులను మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయిలకు అమ్మాలని నిర్ణయించింది.

నాణ్యత బట్టి ఎన్95 మాస్కులను 19 రూపాయిల నుంచి 49 రూపాయిల లోపే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే మాట్లాడు తూ కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని అయన కోరారు.

కాగా మొదటి నుంచి మహారాష్ట్రలో అధిక కరోనా కేసులు నమోదవుతూ వచ్చాయ్.ప్రస్తుతం కూడా భారత్ లో అత్యధిక కరోనా కేసులు ఉన్న రాష్ట్రం ఇదే.

కాగా మంగళవారం ఒక్కటే ఎనిమిది వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు