మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం.. గోమూత్రంతో మాత్రమే ఆ పనులు చేయాలని హుకూం జారీ.. !

గోవులు ఎంత పవిత్రమైనవో, వాటి మూత్రాన్ని కూడా అంతే పవిత్రంగా చూస్తారు.అందుకే ఉదయాన్నే గోమూత్రం తాగే వారు ఉన్నారు.

అపవిత్రమైన ప్రదేశాలను పవిత్రం చేయడానికి ఈ గోమూత్రాన్ని వాడతారు కూడ.ఇకపోతే ఈ గోమూత్రం విషయంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకనుండి ప్రభుత్వ కార్యాలయాల్లో గోమూత్రంతో తయారైన ఫినాయిల్‌ను వాడాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక్కడి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు ఆవు మూత్రంతో చేసిన ఫినైల్‌తోనే శుభ్రం చేయాలని రాష్ట్ర సచివాలయంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఉత్తర్వును విడుదల చేసింది.ఇదిలా ఉండగా ఆవు మూత్రం బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటును ప్రోత్సహించేందుకే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చిందని మధ్యప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ వెల్లడించారు.

ఏది ఏమైన ఈ నిర్ణయం వల్ల పశువుల వధ కొంతైన తగ్గుతుందని సంతోషిస్తున్నారట జంతు ప్రేమికులు.

Advertisement
బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?

తాజా వార్తలు