ఈ ఫొటోలో కనిపిస్తున్న బుడ్డోడు స్టార్ హీరో అని మీకు తెలుసా....?

సినిమా పరిశ్రమలో తమిళ భాషతో పాటు తెలుగు భాషలో కూడా మంచి ఫేమ్ ఉన్నటువంటి హీరోలలో తమిళ స్టార్ హీరో విజయ్ ఒకరు.

అయితే విజయ్ మొదటగా 1984వ సంవత్సరంలో తమిళ ప్రముఖ సీనియర్ దర్శకుడు చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన "వెట్రి" అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత 1996 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు విక్రమన్ దర్శకత్వం వహించిన "పోవే ఉనక్కగా" అనే చిత్రంలో హీరోగా నటించి తన మొదటి చిత్రంతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.కానీ సినిమా కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న విజయ్ ఏ మాత్రం నిరాశ చెందకుండా శ్రమిస్తూ వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.

అయితే తాజాగా విజయ్ కి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు విజయ్ ప్రముఖ సౌత్ స్టార్ హీరో రజనీకాంత్ తో కలిసి షూటింగులో పాల్గొంటున్న సమయంలో తీయించుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన అతి కొద్ది కాలంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.అయితే సోషల్ మీడియాకి విజయ్ దూరంగా ఉన్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం ఈ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే విజయ్ హీరోగా నటించిన "మాస్టర్" చిత్రం విడుదలైంది.కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ అయిన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.భారీ అంచనాల నడుమ విడుదలైన "మాస్టర్ చిత్రం ప్లాప్ అవ్వడం"తో విజయ్ తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంతమేర ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు