దేశంలో ఫేక్ ప్రజలు ఎక్కువైపోయారంటున్న హీరోయిన్....

సినిమాల్లో అవకాశాలు లేక ప్రజలకు సేవ చేయాలని మంచి ఉపాయంతో రాజకీయాల్లోకి  వెళ్లినటువంటి హీరోయిన్ మాధవీలత ఏదో ఒక సమస్యతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా ఢిల్లీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి దారుణంగా ఓడిపోయింది.

ఈ విషయంపై మాధవీలత తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా దేశంలో ఫేక్ ప్రజలు ఎక్కువ అయిపోయారని తనకు ఈ అంశం అస్సలు నచ్చలేదని, దేశం వదిలి పెట్టి వెళ్లిపోవాలని ఉందని అన్నారు.

అంతేగాక ప్రస్తుతం దేశంలోని ప్రజలు  పైకి  కృత్రిమ నవ్వులతో కనిపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. అంతేగాక మరో మూడు శాతం మంది ఓట్లు వేసి ఉంటే ఎన్నికల్లో బిజెపి పార్టీ ఘన విజయం సాధించేదని అన్నారు.

దీంతో నెటిజన్లు ఈ విషయం పై దారుణంగా ట్రైల్స్ చేస్తున్నారు.ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ప్రజలని ఏ పార్టీ నాయకులు కూడా అంచనా వేయలేరని అంటున్నారు కొందరు.మరికొందరైతే.

Advertisement

దేశంలో పార్టీ ని బట్టి కాకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలకు చేసినటువంటి మంచిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు వేస్తారని అంతేగాని కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెడతారని అనుకోవడం తమ అమాయకత్వం అని అంటున్నారు.అలాగే మనుషులు స్వేచ్ఛగా జీవించడానికి ప్రపంచంలో కెల్లా భారతదేశంలో ఉన్నటువంటి సౌకర్యాలు మరెక్కడా లేవని ఒకవేళ ఉంటే నిరభ్యాంతరంగా వెళ్లిపోవచ్చని సలహాలు ఇస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు