మా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేనా? వాళ్ల సహకారం ఎంత ఉంటుంది?

సెప్టెంబర్ లో మా ఎన్నికల నిర్వహణకు అంతా సిద్దం అయ్యారు.గతంలో ఎప్పుడు లేని విధంగా మా ఎన్నికల విషయంలో కాస్త హడావుడి కనిపిస్తోంది.

సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం మొదలుకుని అనేక రకాలుగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.కొందరు మా భవనంకు సంబంధించిన విషయంలో మాట్లాడుతూ ఉంటే మరి కొందరు మాత్రం ఇతర భాషలకు చెందిన వారు ఎక్కువగా ఇక్కడ నటించడం వల్ల మన వాళ్లకు అవకాశాలు ఉండటం లేదు అంటున్నారు.

మొత్తానికి మా ఎన్నికల్లో ఎవరి వాదన వారిది.కనుక వారు ఎవరు ఏం మాట్లాడినా కూడా వివాదాస్పదం అయ్యేలా కొందరు ప్లాన్‌ చేస్తున్నారు.

కొందరు నెట్టింట ఈ విషయమై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.ఎన్నికలు మూడు నెలలు ఉండగానే హడావుడి మొదలు పెట్టిన వారు ఎన్నికల సమయంలో సైలెంట్‌ గా ఉంటారా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

కనుక ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో హడావుడి చేయకుండా సైలెంట్ గా ఉండేలా ప్రముఖులు అయిన చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్‌ బాబు, జగపతిబాబు వంటి పెద్ద వారు ముందుకు వచ్చి మాట్లాడుతారా అసలు ఈ ఎన్నికల్లో వారి స రం ఎంత అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వారే కనుక ముందు ఉండి నడిస్తే ఖచ్చితంగా ఎన్నికలు ప్రశాంతంగా నడుస్తాయి వారు తల్చుకుంటే ఎన్నికలు జరుగకుండా ఏకగ్రీవం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.కనుక వారు ఈ విషయంలో తప్పకుండా దృష్టి పెట్టాలని మా వర్గాల వారు కోరుకుంటున్నారు.కాని ప్రముఖులు మాత్రం వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కనీసం ఓటింగ్‌ కు అయినా వెళ్లాలా వద్దా అనే సందేహం మరియు సంశయంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు